కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో అధికారపక్ష నేత సుబ్రహ్మణ్యస్వామితో పాటు బీజేపి నేతలకు చుక్కెదురైంది. రాహుల్ సిటిజన్ షిప్ పై దాఖలైన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రాహుల్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ న్యాయస్థానంలో బీజేపికి చెందిన నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ను ఇవాళ న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇవాళ ఆ పిటీషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. పిటిషన్ విచారణకు అర్హం కాదని కొట్టివేసింది.
యూకేకు చెందిన ఓ కంపెనీ తమ వార్షిక డేటాలో రాహుల్ గాంధీని బ్రిటీష్ పౌరుడిగా పేర్కొందని, బ్రిటిష్ పౌరసత్వం ఉన్న రాహుల్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హిందూ మహాసభ కార్యకర్త తో పాటు రాహుల్ గాంధీపై అమేధీలో స్వతంత్ర అభ్యర్థిగా పోరాడుతున్న ప్రత్యర్థి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను తోసిపుచ్చింది.
‘ఏదో ఒక కంపెనీ ఏదో ఒక పత్రాల్లో రాహుల్ ను ఉద్దేశిస్తూ బ్రిటిష్ వ్యక్తి అని పేర్కొంటే ఆయన బ్రిటిష్ పౌరుడు అయిపోతారా..? ఈ పిటిషన్ కు ఎలాంటి అర్హత లేదు. దీన్ని మేం కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం వెల్లడించింది. ఇక రాహుల్ పౌరసత్వ స్థితిని ప్రశ్నిస్తూ బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాహుల్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదే విషయమై 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాహుల్ పౌరసత్వంపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక ఎన్ని దెబ్బలు తాకినా.. ఈ అంశంలో ప్రత్యర్థులకు బుద్ది మాత్రం మారడం లేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more