సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత దానిపై ఏమాత్రం ఆసక్తి లేని వారు కూడా.. తమ వీడియో ఏదో ఒకటి హల్ చల్ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుడటం సర్వసాధారణంగా మారిపోయింది. తమకు చెందిన చిన్నపాటి వీడియాతో సంచలనం సృష్టించేందుకు నెట్ జనులు భయానక ఫీట్లు కూడా చేస్తుంటారు. కొందరు అదృష్టం బాగుండి విజయంసాధించి క్రేజ్ సంపాదిస్తే.. మరికొందరు ప్రయత్నాలు విఫలమై భారీ మూల్యం కూడా చెల్లించుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. అయితే కొన్ని సందర్భాలలో విజయం వరించిన వారు కూడా మరికొన్ని ప్రయత్నాలు విఫలమై చేదు జ్ఞాపకాలను మిగుల్చుతుంది.
తాజాగా ఆహారం విషయంలో ఓ యువతి చేసిన ప్రయత్నం భయానక అనుభవాన్ని ఎదుర్కోంది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. అసలు ఈ యువతి చేసిన ప్రయత్నం ఏమిటో తెలుసా.? ప్రాణంతో ఉన్న ఆక్టోపస్ (సముద్రంలో లభ్యమయ్యే ఓ జలచరం)తో కడుపు నింపుకోవాలనుకుంది ఓ చైనాకు చెందిన యువతి. రికార్డు చేసి వీడియోను పెట్టడం ఎందుకని భావించిందో ఏమిటో తెలియదు కానీ.. ఏకంగా లైవ్ స్ట్రీమింగ్ లో తినేస్తే రెస్పాన్స్ బాగా వుంటుందని, తన వీడియోకూ లైకులు, వ్యూస్ కూడా అధికంగా లభిస్తాయని నిర్ణయించుకుంది.
ఇంకేముందు విన్యాసానికి తెరలేపుతూ అక్టోపస్ ను చేతుల్లో పట్టుకుని లైవ్ స్ట్రీమింగ్ అన్ చేసింది. అంతే అమె ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టి, తాను తినాల్సిన ఆక్టోపస్తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆక్టోపస్ ఏమాత్రం ఆ యువతికి నోటి చిక్కకుండా తన టెంటకిల్స్‌తో ఆమె చర్మాన్ని గట్టిగా పట్టుకుంది. దీంతో భయానికి గురైన ఆ యువతి గట్టిగా కేకలు వేస్తూ, ఏడుపు మొహం పెట్టి దాన్నుంచి విడిపించుకుకోడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఓవైపు ఏడూస్తూనే, దాని నుంచి విముక్తి పోందాలన్న ప్రయత్నాన్ని మాత్రం మానలేదు. దీంతో ఎట్టకేలకు అమెప్రయత్నం ఫలించింది.
ఆక్టోపస్ నుంచి ఎలాగోలా బయటపడిన యువతి.. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంది. అయితే దాని ప్రభావం వల్ల ఆమె మొహం మీద చిన్నపాటి గాయం అయింది. గాయాన్ని కూడా లైవ్ స్ట్రీమింగ్ లో చూపుతూ.. చూడండీ.. దీన్ని సజీవంగా తినాలనే నా ప్రయత్నాలపై దెబ్బకొ్ట్టిన ఈ ఆక్టోపస్.. నా చెంపపై ఎలా గాయం చేసిందో అని చెప్పడం కొసమెరుపు. చైనీస్ ఫొటో షేరింగ్ యాప్ కువైషౌలో ఆ యువతి ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ తొందరలో ఉన్నప్పుడు జీవంతో ఉన్న ఆక్టోపస్ ను తినడానికి ప్రయత్నించొద్దని ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. లక్షల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more