VH objects traffic police stoping vehicles in Hot Temperatures ఎండలో ఫైన్లేంది.. ట్రాఫిక్ పోలీసులతో వీహెచ్ వాగ్వాదం..

V hanumantha rao objects traffic police stoping vehicles in hot sun

VH, V Hanumantha Rao, senior leader, traffic police challans, summer, Heat wave, KCR, Telangana CM, Congress, Telangana, politics

Congress Senior Leader V Hanmatha Rao objects traffic police penalizing vehicles in hot day, says people are suffering from hot sun, but police busy in challanising vehicles.

ITEMVIDEOS: ఎండలో ఫైన్లేంది.. ట్రాఫిక్ పోలీసులతో వీహెచ్ వాగ్వాదం..

Posted: 05/10/2019 07:12 PM IST
V hanumantha rao objects traffic police stoping vehicles in hot sun

ప్రస్తుతం కొందరి నాయకుల మాదిరిగా కాకుండా తన పాతతర నాయకత్వ లక్షణాలతో ఏదో ఒక విషయమై ప్రజలకు ఎలా మేలు జరుగుతుందా.? ఎలా వారికి ఇంకాస్త మేలు చేయాలా అన్ని విధంగా ఆలోచించే నాయకుల్లో ఒకరు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. ఆయన పెద్ద మనిషి తరహాలో తీసుకుని వాడే బాష కొందరికి ఇబ్బందకరంగా అనిపించినా.. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు మాత్రం కొంత సత్యాన్ని దాగివుంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఆమధ్యకాలంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ చిత్ర విడుదల నేపథ్యంలో వీహెచ్ చేసిన వాదనల్లో మాత్రం నిజం లేకపోలేదన్నది వాస్తవం. ఇప్పటికే సినిమాలు చూసి యువత అందులోని మంచి కన్నా చెడును.. మెసేజ్ ల కన్నా అధికంగా వల్గారిటీని ఎక్కువగా ఫాలో అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆ చిత్ర పోస్టర్ల విషయంలో ఆయన చేసిన వాదనలు యువతకు తప్పులా కనిపించినా.. తల్లిదండ్రులకు, సభ్య సమాజాంపై అవగాహన కల్గిన వారికి మాత్రం కరెక్టేనపించాయి.

ఇక ఇవాళ తాజాగా ఆయన హైదరాబాద్‌లో రోడ్డుపై హల్‌చల్ చేశారు. సిటీ ట్రాఫిక్ పోలీసుల వైఖరి పట్ల కస్సుబుస్సులాడిన వీహెచ్... తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ఏజీ ఆఫీస్ దగ్గర వాహనాలకు చలాన్లు వేస్తున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మొదట వాహనదారులతో మాట్లాడిన వీహెచ్.. ఆ తర్వాత పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగారు. ప్రజలను ఎండలకు పరేషాన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వీహెచ్... చలాన్లు వేస్తున్న పోలీసులను అడ్డుకుని... వాహనదారులను అక్కడి నుంచి పంపించేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles