Vajpayee Wanted To Sack Modi, Says Yashwant Sinha మోడీని సీఎంగా తప్పించేందుకు అప్పట్లో నిర్ణయం: యశ్వంత్ సిన్హా

Pm modi s 56 inch chest only for pakistan shrinks upon mention of china says yashwant sinha

yashwant sinha, yashwant sinha modi, modi advani, advani vajpayee, 2002 godhra riots, modi 2002 gujarat, gujarat riots, lal kishan advani, Atal Bihari vajpayee, 2002 godhra riots, gujarat, NDA, politics

Yashwant Sinha claimed the then PM AB Vajpayee was set to dismiss Narendra Modi, Gujarat Chief Minister at the time, after the 2002 post-Godhra riots, but withheld the decision as Home Minister L K Advani had threatened to resign from the Cabinet on the issue.

అద్వానీ అడ్డుపడకపోతే.. మోడీ సీఎంగానే కొనసాగేవారు కాదు: యశ్వంత్ సిన్హా..

Posted: 05/11/2019 06:45 PM IST
Pm modi s 56 inch chest only for pakistan shrinks upon mention of china says yashwant sinha

బీజేపి మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రధాని నరేంద్రమోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీ గుజారత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలోనే ఆయనను పదవి నుంచి తప్పించాలని, అవసరమైతే ప్రభుత్వాన్నే రద్దు చేయాలని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ నిర్ణయించుకున్నారని పేర్కోన్నారు. అయితే వాజ్ పాయ్ చర్యలను అడ్డుకున్న మోడీకి పదవీ గండం కలగకుండా ముందుకు సాగేలా చేసింది బీజేపి కురువృద్ద నేత లాల్ కిషన్ అద్వానియేనని చెప్పారు.

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న 2002లో గోద్రా అల్లర్ల చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సంకీర్ణ ప్రభుత్వంగా కేంద్రంలో బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే కొనసాగుతుంది. ఆ మారణకాండ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో సంకీర్ణంలోని పార్టీల ఒత్తడి పెరగడంతో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీని తొలగించాలని అప్పుడు డిమాండ్ వచ్చిందని అన్నారు. అందుకు సంబంధించిన విషయాలను యశ్వంత్ సిన్హా తాజాగా మీడియా ముందు ప్రస్తావించారు.

విపక్షాలతో పాటు స్వపక్షంలోని పార్టీల ఒత్తడి నేపథ్యంలో నరేంద్ర మోదీని నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పదవి నుంచి తొలగించడానికి నిర్ణయించుకున్నారని తెలిపారు. అందుకు ఆయనతో రాజీనామా చేయించాలని అనుకున్నారట. ఒకవేళ అందుకు మోదీ నిరాకరిస్తే ఏకంగా ప్రభుత్వాన్నే రద్దు చేయాలన్న కఠిన నిర్ణయాన్ని కూడా వాజ్‌పేయీ అప్పట్లో పరిగణనలోకి తీసుకున్నారని సిన్హా తెలిపారు. కానీ అప్పటి హోంమంత్రి లాల్‌ కృష్ణ అడ్వాణీ అందుకు అడ్డుపడడంతో ఆ నిర్ణయం అమలు చేయలేకపోయారని వివరించారు.

మోదీని పదవి నుంచి తప్పిస్తే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అడ్వాణీ హెచ్చరించారని యశ్వంత్‌ సిన్హా తెలిపారు. దీంతో వాజ్‌పేయి వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని మోదీ చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గత ఐదేళ్ల మోదీ ప్రభుత్వ పనితీరుపైనే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని.. దేశ చరిత్ర ఆధారంగా కాదన్నారు. ప్రచారంలో భాగంగా పాకిస్థాన్‌ అంశాన్ని పదే పదే తెరమీదకి తేవడాన్ని ఆయన తప్పుబట్టారు. మరో పోరుగు దేశం చైనా అరుణాచల్ ప్రదేశ్ లో చోచ్చుకువచ్చిన విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని సిన్హా నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yashwant sinha  lal kishan advani  Atal Bihari vajpayee  2002 godhra riots  gujarat  NDA  politics  

Other Articles