ఎన్నికల ఫలితాల ప్రకటనకు సమయం దగ్గరపడ్డ సమయంలో ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పంజాబ్, హరియాణాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ పై వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘాజీపూర్ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్ అన్సారీ అనే అభ్యర్థి స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్ రూమ్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా రిటర్నింగ్ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్ రూమ్ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు.
మరో లోక్ సభ నియోజకవర్గమైన చందౌలీలో ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్ కాంప్లెక్స్ లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు చరవాణిలో చిత్రీకరించారు. అలాగే పోలింగ్ ముగిసిన రెండు రోజుల తరవాత ఈవీఎంలను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించడం వీడియోలో గమనించవచ్చు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్ యూనిట్లని తెలిపారు. పోలింగ్ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు.
మరో ఘటనలో దొమరియాగంజ్ కు చెందిన జిల్లా ఎన్నికల అధికారి ఈవీఎంల తరలింపుపై సంబంధిత సిబ్బందిని ఫోన్లో ప్రశ్నిస్తుండగా.. అవతలివైపు నుంచి సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. బిహార్, హరియాణా, పంజాబ్లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి రావడం ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. ‘‘హఠాత్తుగా ఈవీఎలంను తరలిస్తున్నారన్న వార్తలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి? వాటిని ఎవరు తరలిస్తున్నారు? ఈ క్రతువు ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది’’ అని ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు.
గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి. ఈ నేపథ్యంలో పలు వర్గాలు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూంల వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం(ఈసీ).. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపారు.
Without any comment, an EVM video from Chandauli, UP.
— Ravi Nair (@t_d_h_nair) May 20, 2019
pic.twitter.com/Gmwj638mdo
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more