events organised by NRI for Elections counting ఇక్కడ మందుబాబులు డీలా.. అక్కడ ఈవెంట్ల గోల

All set for counting tomorrow liquor ban in effect

Lok sabha elections, BJP, Narendra Modi, Rahul Gandhi, Congress, live broadcast, NRI, Events, Liquor ban, India, politics

Non Resident Indians managing events while counting starts in few hours. In fact, Saturday or Sunday is crazy for the events ..going abroad. But tomorrow's special events will be getting good response from exile, While excise department had banned sale of liquor in india tomorrow.

ఇక్కడ మందుబాబులు డీలా.. అక్కడ ఈవెంట్ల గోల

Posted: 05/22/2019 05:29 PM IST
All set for counting tomorrow liquor ban in effect

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో.. సుమారు ఒక బిలియన్ ఓటర్ల తీర్పు వెలువడుతున్న క్రమంలో అభ్యర్థి అభ్యర్థికీ మధ్య, రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య లోక్ సభ స్థానానికి, స్థానానికీ మధ్య నరాలు తెగే ఉత్కంఠ కలుగుతుంది. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతున్న క్రమంలో ఆ ఉత్కంఠను ఆయా రాష్ట్రాల్లో రెట్టింపు చేస్తోంది. ఓటర్లు నిక్షిప్తం చేసిన ఓట్లను మరికొన్ని గంటల్లో సిబ్బంది లెక్కించనున్నారు. వాస్తవానికి రాజకీయ పార్టీలు, నేతలు, శ్రేణులు, కార్యకర్తల్లో తమ పార్టీ మనుగడ ఏంటీ అన్న ఉత్కంఠ ఉంటుంది,

సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వివిధ రాజకీయ పార్టీల వీరాభిమానులు తమ అభ్యర్థుల గెలుపోటముల విషయంలో ఉద్వేగానికి లోనై.. ఉద్రేకంలో హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా వుండేందుకు ప్రభుత్వాలు మనదేశంలో మద్యం దుకాణాలను బంద్ చేస్తూ.. మద్యం ప్రియులకు చేదువార్తను మిగిల్చాయి. శాంతిభద్రతల పేరుతో ప్రభుత్వాలు రేపు మద్యం అమ్మకాలను నిలిపేయడంతో మందుబాబులు మాత్రం డీలా పడుతున్నారు. మరికోందరు మాత్రం ఇవాళ రేపటి సరంజామాను కూడా తీసుకుని చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు.

ఇది మన దేశంలోని పరిస్థితి, కాగా, ప్రవాసభారతీయుల్లో కూడా ఈ సారి టెన్షన్ పట్టుకుంది. వారు కూడా ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఫలితాలను పదిమందితో కలసి లైవ్ గా వీక్షించేందుకు అక్కడి మనవారు ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఆస్ట్రేలియాలోని ప్రవాసులు కళ్లప్పగించి చూసేందుకు సిద్ధమయ్యారు. ప్రవాసభారతీయుల్లో వీకెండ్ ఈవెంట్లకే గిరాకీ వుండంగా.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్పెషల్ ఈవెంట్లకు ప్రవాసుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఆస్ట్రేలియాలో 'గేట్ వే‘ పేరుతో సిడ్నీలో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 'ఇండియన్ ఎలక్షన్ 2019 కౌంటింగ్‘ పేరుతో నిర్వహించే కార్యక్రమంలో పెద్ద పెద్ద ఎల్ఈడీ తెరలు పెట్టి ఎప్పటికప్పుడు వారికి లైవ్ అప్‌డేట్స్ అందిస్తారు. ప్రత్యేకంగా ముద్రించిన కార్డులో కేసీఆర్, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ఫోటోలను ముద్రించారు. ఇందుకోసం వారి వారి పేర్లను నమోదు చేసుకోవాలని 0406 591 234 అనే నంబర్ కూడా ఇచ్చింది. అంతేకాదు చిన్న సైజు మెను కూడా సిద్ధం చేసింది. ఇందులో 3 బీర్లకు 10 డాలర్లు, వెజ్ బఫెట్‌కు 15 డాలర్లు, నాన్ వెజ్ బఫెట్‌కు 18 డాలర్లు చార్జీ చేస్తామని తమ ముద్రించిన కార్డులో పేర్కొంది.

ఇక అమెరికాలోని ప్రవాసభారతీయుల విషయానికి వస్తే.. 'జడ్జీమెంట్ డే‘ పేరుతో ఈవెంట్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఎంట్రీ ఫీజు మాత్రం 10 డాలర్లు చెల్లించాలని స్పష్టంచేసింది. దీంతోపాటు నరేంద్ర మోదీకి సంబంధించి 'నమో‘ టీ షర్ట్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలని నిబంధన పెట్టింది. ఇందుకోసం మరో 10 డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈవెంట్ల నిర్వహణ ఉంటుందని నిర్వాహకులు స్పష్టంచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lok sabha elections  BJP  Narendra Modi  Rahul Gandhi  Congress  live broadcast  NRI  Events  Liquor ban  India  politics  

Other Articles