సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు తమ పదవులను త్యజిస్తూ.. తమ రాజీనామాలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ అనుసరించిన విధంగానే ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ మరోమారు తన రాజీనామాను అధిష్టానానికి పంపారు. సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి తాను నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కోన్నారు.
ఇటు ఒడిశా పీసీసీ చీఫ్ నిరంజన్ పట్నాయక్‌లు తన పదవి రాజీనామా చేశారు. ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 147 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నిరంజన్ పార్టీని విజయ పథాన నిలబెట్టలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాగా, రాహుల్ గాంధీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకన్నారని ఉదయం వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ విషయాన్ని తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా దృష్టికి తీసుకెళ్లగా ఆమె వారించినట్టు సమాచారం.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, గులాంనబీ అజాద్, వీరప్ప మొయిలీ తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ రాజీనామా వార్తలు ప్రకంపనలు రేపాయి. దీంతో కాంగ్రెస్ ఆ వార్తలను ఖండించింది. అసలు తమ సీడబ్యూసీ సమావేశంలో రాహుల్ రాజీనామా వార్తలు తెరపైకి రాలేదని వెల్లడించింది. ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు ఒకటికి రెండు సార్లు కన్షామేషన్ తీసుకోవాలని, ఇష్టానుసారంగా వార్తలను రాసి.. వ్యక్తుల, వ్యవస్థల, పార్టీల ప్రతిష్టను దిగజార్చేందుకు చేసే యత్నాలు సహించరానివని పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more