బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మరోమారు ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ గణేషి లాల్.. నవీన్ పట్నాయక్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఒడిశాకు వరుసగా ఐదవసారి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణం చేయటం విశేషం. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణస్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పట్నాయక్‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలుగా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
పట్నాయక్ కేబినెట్ లో ఈ సారి 10 మంది కొత్తవారికి అవకాశం కల్పించటం మరో విశేషం. లోక్ సభ ఎన్నికలతో పాటు ఒడిషా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 147 స్థానాలున్న ఒడిశా శాసనసభలో 113 చోట్ల బీజేడీ అభ్యర్థులు గెలిచి విజయం సాధించారు. ఒకసారి గెలవడమే గొప్ప విషయంగా మారిన ఈ సమయంలో వరుసగా ఐదుసార్లు విజయం సాధించడమంటే అంత ఆషామాషీ కాదు. కానీ నవీన్ పట్నాయక్‌ను మాత్రం ఒడిశా ప్రజలు వరుసగా ఐదోసారి సీఎంను చేశారు. అందుకు ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన పలు మహిళా. గ్రామీణ రైతు, యువత సంక్షేమ పథకాలు ఆయనకు మళ్లి, మళ్లీ సీఎం ఫీఠం అందుకునేలా చేస్తున్నాయి.
నవీన్ పట్నాయక్ పట్ల గ్రామీణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అమితమైన ఆదరణ ఉంది. అందుకే 2000, మార్చి 5 నుంచి ఇప్పటికీ ఆయనే సీఎం, మరో ఐదేళ్లు కూడా పట్నాయక్‌దే ముఖ్యమంత్రి పీఠం. నవీన్ పట్నాయక్ తండ్రి దివంగత బిజయానంద పట్నాయక్ రెండు పర్యాయాలు ఒడిశా సీఎంగా పనిచేశారు. ఆయన మరణం తర్వాత 1997లో బిజూ జనతాదళ్ పేరిట కొత్త రాజకీయ పార్టీని నవీన్ స్థాపించారు. తండ్రి ప్రాతినిథ్యం వహించిన అస్కా పార్లమెంటు స్థానం ఉపఎన్నికలో విజయం సాధించారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే నవీన్ ఒడిశా బయటే పెరగడంతో మాతృభాష ఒడియా మాట్లాడటం రాదు. ఎన్నికల ప్రచార సభల్లో పట్నాయక్ తన ప్రసంగాలను ఇంగ్లిష్‌లో రాసుకొని మాట్లాడతారు.
Bhubaneswar: Naveen Patnaik takes oath as the Chief Minister of Odisha. This is his 5th consecutive term as the Chief Minister. pic.twitter.com/Wnagx75v76
— ANI (@ANI) May 29, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more