అంతర్జాలంతో మంచి ఎంత జరుగుతుందో.. చెడు కూడా అంతే జరుగుతుంది. అన్ లైన్ ను అవసరాలకు వినియోగించుకునేలా తీర్చిదిద్దుతున్నా.. దానిని తమ స్వార్థానికి వాడుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగానే వుంది. అన్ లైన్ లో తిష్ట వేసిన సైబర్ మాయగాళ్లు.. ఎన్ని అగడాలు సృష్టిస్తున్నారో మనకు తెలిసిందే. ఎంతో మంది అమాయకులు వీరి చేతుల్లో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా కూడా సైబర్ నేరగాళ్ల మోసానికి గురయ్యారు.
నకిలీ మెయిల్ తో లోధా దగ్గర నుంచి సైబర్ కేటుగాళ్లు లక్ష రూపాయలు కాజేశారు. అదీనూ తన సహోద్యోగి జస్టిస్ బి.పి.సింగ్ పేరుతో ఈ మెయిల్ పంపిన కేటుగాళ్లు.. ఆయనను అత్యంత చాకచక్యంగా బురడీ కొట్టించారు. తీరా తాను సైబర్ నేరగాళ్లు చేతిలో చిక్కుకున్నానని తెలిసిన తరువాథ ఆయన మరోమార్గం లేక.. పోలీసులకు పిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మాజీ సీజేఐ లోధా రెగ్యులర్ గా తన మిత్రుడు, రిటైర్డ్ జడ్జి బీపీ సింగ్‌తో ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు చేస్తుండేవారు.
ఈ సమయంలో ఏప్రిల్ 19, 2019న లోధాకు.. అర్జెంట్‌గా 1 లక్ష రూపాయలు కావాలంటూ బీపీ సింగ్ అకౌంట్ నుంచి మెయిల్ వచ్చింది. సోదరుడి ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలంటూ ఆ మెయిల్లో ఉంది. దీంతో వెంటనే లోధా మెయిల్లో ఉన్న అకౌంట్ నంబర్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. ఓ నెల రోజుల తర్వాత బీపీ సింగ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు లోధాకు మెయిల్ వచ్చింది. దీంతో లోధా వెంటనే మాలవ్యా నగర్లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. దాంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చీటింగ్, ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more