పోర్జరీ, డాటా చోరి, అధికార దుర్వినియోగం కేసుల్లో అభియోగాలు ఎదుర్కోంటున్న సీనియర్ పాత్రికేయుడు, టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. ఇవాళ కోర్టులో రవిప్రకాష్ తరపున వాదనలు వినిపించిన దిల్ జిత్ సింగ్ అహువాల్యా... టీవీ 9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిగిందన్నారు. షేర్లు కొనుగోలు చేసినప్పుడు మనీ ట్రాన్సక్షన్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు.
కాపీ రైట్స్ ప్రకారం టీవీ 9 లోగో రవిప్రకాష్ కే చెందుతుందని తన వాదనలు బలంగా వినిపించారు. రవిప్రకాష్ 40వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మడం వాస్తవమేనని.. ఈ షేర్లకు సంబంధించి అర్థిక వ్యవహారాలు మొత్తం బ్యాంక్ ల ద్వారా జరిగాయన్నారు. లావాదేవీల జరిగినట్టు బ్యాంకుల నుంచి తెచ్చిన స్టేట్ మెంట్లే ఈ విషయాన్ని రూడీ చేస్తాయని అన్నారు. ఇక టీవీ 9 వ్యవహారాలకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో కేసు పెండింగ్ లో ఉందన్నారు. రవిప్రకాష్ పై మూడు కేసులు వెంట వెంటనే నమోదు అయ్యాయన్నారు.
అయితే టీవీ 9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ పేపర్లను కోర్టుకి సమర్పించారు. బ్యాంకుల ద్వారానే మనీ ట్రాన్సాక్షన్ జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకి సమర్పించారు. టీవీ 9 లోగో వ్యక్తి ప్రాపర్టీగా ఉండదని, కంపెనీ ప్రాపర్టీగా మాత్రమే ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ లో ఎలాంటి కేసు పెండింగ్ లో లేదన్నారు. రవిప్రకాష్, శివాజీలకు సంబంధించిన పిటిషన్ పై నేషనల్ కంపెనీ అప్పియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకి తెలియజేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని వాయిదా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more