హిందూ ఉగ్రవాదిగా అభియోగాలు ఎదుర్కోని రిమాండ్ లో వుంటూ అనారోగ్యంతో బాధపడుతున్నానని బెయిలుపై బయటకు వచ్చిన వివాదాస్పద బీజేపి నాయకురాలు.. ఏకంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై పోటీ చేసి.. మధ్యప్రధేశ్ లోని బోపాల్ నియోజకవర్గం నుంచి బరిలో దిగి గెలుపోంది పార్లమెంటులోకి అడుగుపెట్టిన ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్. అయితే అమె ఎన్నికలలో ఓటర్లను సెంటిమెంటుతో ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.
తనను జైలులో ఎలా హింసించారన్న విషయాలతో పాటు పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే అమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పెద్ద వింతేమీలేదు. ఎందుకంటే సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సార్వసాదారణమే. ఇక తాజాగా అమె మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేసి వార్తల్లో నిలిచారు. మధ్యప్రదేశ్ లోని సెహోర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలో వేడిరాజేస్తున్నాయి.
మరుగుదొడ్లు, మురుగు కాల్వలు శుభ్రం చేయడానికి తను ఎంపీగా ఎన్నిక కాలేదంటూ అమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి చేపడుతున్న స్వచ్చా అభియాన్ కార్యక్రమానికి తూట్లు పోడిచేలా వున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలకు ఏం చేస్తానని చెప్పి ఎంపీని అయ్యానో వాటన్నింటినీ చేసేందుకు కట్టుబడి ఉన్నానని, నిజాయతీగా చేస్తానని వ్యాఖ్యానించారు. దీంతో సాథ్వి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
#WATCH BJP MP from Bhopal, Pragya Thakur in Sehore: Hum naali saaf karwane ke liye nahi bane hain. Hum aapka shauchalaya saaf karne ke liye bilkul nahi banaye gaye hain. Hum jis kaam ke liye banaye gaye hain, vo kaam hum imaandaari se karenge. #MadhyaPradesh pic.twitter.com/VT4pcGKkYx
— ANI (@ANI) July 21, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more