కర్ణాటక రాజకీయాలు యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ బలనిరూపణకు స్పీకర్ రమేశ్ కుమార్ సోమవారం రాత్రి 9 గంటల వరకు విధించిన గడువు కూడా ముగిసినా ఓటింగ్ జరగకుండానే సభ వాయిదా పడింది. దీంతో నేటి సాయంత్రం 6 గంటల వరకు స్పీకర్ మరో డెడ్‌లైన్ విధించారు. ఆ లోపు కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు.
కాగా, సోమవారం ఉదయం నుంచి అసెంబ్లీలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ వ్యతిరేకించినప్పటికీ స్పీకర్ మాత్రం అధికార పక్షానికి మాట్లాడేందుకు పదేపదే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్పీకర్‌తో కుమారస్వామి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలపరీక్షకు రాత్రి 9 గంటల వరకు సీఎంకు స్పీకర్ సమయమిచ్చారు. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తమ పిటిషన్ పెండింగులో ఉన్నందున మరింత సమయం ఇవ్వాలని కోరినా స్పీకర్ నిరాకరించారు.
బలపరీక్షకు సిద్ధం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా స్పీకర్ హెచ్చరించారు. కాగా, సోమవారం రాత్రి వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైనా.. అదే గందరగోళం నెలకొంది. దీంతో ఓటింగ్ జరగకుండానే సభ మంగళవారానికి వాయిదా పడింది. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నేటి సాయంత్రం ఆరు గంటల లోపు తన బలాన్ని నిరూపించుకోవాలని కుమారస్వామికి మరో డెడ్‌లైన్ విధించారు.
ఇధిలావుండగా ఇప్పటివరకు కుమారస్వామి ముఖ్యమంత్రిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండగా, మరో 8 మంది అదే దారిలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకూ 12 మంది కాంగ్రెస్ సభ్యులు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా, అనారోగ్యంతో ఉన్నానని, సభకు రాలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంతపాటిల్ తేల్చేశారు. దీంతో 16మంది బలనిరూపణకు దూరంగా ఉన్నట్టు కాగా, ఇప్పుడు మరో 8 మంది రిజైన్ యోచనలో ఉన్నట్టు వార్తలు రావడం కుమారస్వామికి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది.
ఇక ఇదే సమయంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన అదేశాలను కూడా తోసిపుచ్చుతూ.. స్పీకర్ రూలింగ్ ఇవ్వడం కుమారస్వామికి కలసివస్తుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కనెబెడితే.. ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో సేద తీరుతున్న 15 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు వణుకుపుట్టిస్తుందని సమాచారం. ఇంతకీ ఆ రూలింగ్ ఏంటంటే.. పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం వుందని స్పీకర్ తేల్చిచెప్పడమే.
దీంతో సభకు హాజరు కావాల్సిందేనంటూ కాంగ్రెస్, జేడీఎస్‌లు పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి. ఇంకోవైపు, రాజీనామాలపై విచారణకు హాజరుకావాల్సిందిగా ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపారు. నిజానికి సోమవారమే వారు సభకు హాజరు కావాల్సి ఉన్నా వారెవరూ రాలేదు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, బీఎస్పీ సభ్యుడు ఒకరు అనారోగ్యం నెపంతో సభకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. ఇక ఇవాళ ఏలాంటి వ్యూహాలతో కుమారస్వామి ప్రభుత్వం గట్టెక్కుతుందో వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more