Telangana high court orders GHMC to submit masterplan 2031 మాస్టార్ ప్లాన్ ను సమర్పించండీ: హైకోర్టు అదేశం

Telangana high court asks government to submit hyderabad master plan 2031

KCR, Congress, TRS, Governor, ESL Narasimhan, Opposotion Parties, Governor, High Court, New Assembly, Hyderabad, Telangana, PoliticsTelanagna Government, Politics

A division bench of the Telangana High Court directed the State government to submit before it the ‘Hyderabad Master plan 2031’ to know whether Errum Manzil and other such monuments were present in the Special Conservation Zone or not.

2031 మాస్టార్ ప్లాన్ ను సమర్పించండీ: హైకోర్టు అదేశం

Posted: 07/27/2019 09:41 AM IST
Telangana high court asks government to submit hyderabad master plan 2031

హైదరాబాద్ లో నూతనంగా అసెంబ్లీని నిర్మించాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడున్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఏంటని తెలంగాణ ప్రభుత్వాన్ని రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశ్నించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ 2031 మాస్టార్ ప్లాన్ ను సమర్పించాలని కూడా హైదరాబాద్ మహనాగర పాలక మండలిని అదేశించింది. 2031 మాస్టార్ ప్లాన్ లో ఎర్రమంజిల్ లోని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను ప్రత్యేక పరిరక్షణ జోన్ పరిధిలో నిక్షిప్తం చేశారా.? లేదా.? అన్నది ప్లాన్ పరిశీలిస్తే స్పష్టమవుతుందని న్యాయస్థాన ధర్మాసనం అభిప్రాయపడింది.

నూతన అసెంబ్లీ నిర్మాణంపై కాంగ్రెస్ సహా పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతకు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్‌ భవనాలకు రక్షణ ఉందని గుర్తు చేసిన కోర్టు, హుడా స్థానంలో వచ్చిన హెచ్‌ఎండీఏ అనుమతులు లభించాయా? అని కూడా అడిగింది. పాత భవనాల కూల్చివేతకు అనుమతులు ఉన్నాయో, లేదో చెప్పడానికి జాప్యం ఎందుకని మండిపడింది.

అసెంబ్లీని నిర్మించేందుకు ఎర్రమంజిల్‌ లోని పురాతన భవనాలను కూల్చి వేయవద్దని పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇవి హెరిటేజ్ భవంతులని, వీటిని పరిరక్షించేందుకు గతంలో హుడా పలు నిబంధనలు విధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు గుర్తు చేయగా, ఆ నిబంధనలను గతంలోనే తొలగించినట్టు ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదించారు. ఆపై కేసు విచారణ వాయిదా పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Congress  TRS  Governor  High Court  New Assembly  Hyderabad  Telangana  Politics  

Other Articles