former union minister Jaipal Reddy is no more కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇక లేరు..

Senior cong leader former union minister jaipal reddy is no more

S Jaipal Reddy, Congress, JDS, Lok Sabha, former union minister, rahul gandhi, ram nath kovind, venkaiah naidu, CM KCR, Pawan Kalyan, YS Jagan, Andhra Pradesh, Telangana news, Telangana

Senior Congress leader and former union minister S Jaipal Reddy died at a city hospital in the early hours of Sunday.

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇక లేరు..

Posted: 07/28/2019 09:14 AM IST
Senior cong leader former union minister jaipal reddy is no more

కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా జైపాల్ రెడ్డి నిమోనియాతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 
ఆయన పెట్రోలియం మరియు సహజవాయువు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్.ఎ. పట్టా పొందారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన 1969 మరియు 1984 మధ్య నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. భారత పార్లమెంటుకు మొదటిసారిగా 1984లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.

ముందుగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా ఉన్నా ఆయన ఇందిరా గాంధీ పాలనలో ఎమర్జెన్సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1977లో జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీలో 1985 నుండి 1988 వరకు జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. అనంతరం భారత పార్లమెంటుకు మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా 1999 మరియు 2004లలో రెండు సార్లు ఎన్నికయ్యారు.

రాజ్యసభ సభ్యునిగా 1990 మరియు 1996 లలో రెండు సార్లు ఎన్నుకోబడ్డారు. ఐకే గుజ్రాల్‌ కేబినెట్‌లో రెండు సార్లు కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియల విషయమై, టీఆర్ఎస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ పక్కనే జైపాల్ రెడ్డి స్మారకానికి స్థలాన్ని కేటాయిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం సీఎం కేసీఆర్ వెల్లడించారు. అక్కడే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాలని, ఆపై ఆ ప్రాంతాన్ని దర్శనీయ స్థలంగా మారుస్తామని అన్నారు. జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, ప్రజల కల ఫలించడం వెనుక ఆయన చేసిన కృషి ఎంత గొప్పదో తనకు తెలుసునని అన్నారు.

జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, జైపాల్ అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని, భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం గాంధీభవన్ కు తరలించి, ఆపై నక్లెస్ రోడ్ కు తీసుకెళతామని కుటుంబీకులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో జైపాల్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : S Jaipal Reddy  Congress  JDS  Lok Sabha  former union minister  Telangana  

Other Articles