దేశరాజకీయాలలో తనదైన ముద్రవేసిన అజాతశత్రువుగా, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహిత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియలు సోమవారం నాడు పీవీఘాట్‌లో ముగిశాయి. అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలను నిర్వహించింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున ఆయన కన్నుమూశారు. ఉదయం జైపాల్ రెడ్డి నివాసం నుండి ఆయన పార్థీవదేహన్ని గాంధీభవన్‌కు తీసుకొచ్చారు.
పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సందర్శనార్ధం గాంధీభవన్ లో జైపాల్ రెడ్డి పార్థీవ దేహాన్ని ఉంచారు. గాంధీభవన్ నుండి పీవీ ఘాట్ వరకు అంతిమయాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ నేత మల్లిఖార్జున ఖర్గే, ,కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ తదితరులు కూడ జైపాల్ తెలంగాణకు చెందిన పలు పార్టీ నేతలు కూడ జైపాల్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
పార్టీ నేతలు, కుటుంసభ్యులు, సన్నిహితులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు, అనూయాయువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆశ్రునయనాలతో తమ ప్రియతమ నేతకు చివరిసారి వీడ్కోలు పలికారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. గాంధీభవన్ నుంచి ప్రారంభమై.. పీవి ఘాట్ వరకు సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.
పాడె మోస్తూ.. కన్నీరుమున్నీరైన రమేష్ కుమార్
జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. యడియూరప్ప బలపరీక్ష పూర్తైన తర్వాత రమేష్ కుమార్ హుటాహుటిన జైపాల్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హైద్రాబాద్ కు వచ్చారు. ఎయిర్పోర్ట్ నుండి రమేష్ కుమార్ పీవీఘాట్ కు చేరుకొన్నారు. పీవీఘాట్‌లో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పక్కనే రమేష్ కుమార్ కూర్చొన్నారు.
జైపాల్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా కుటుంసభ్యులతో కలిసి కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ పాడె మోసారు. ఈ సమయంలో రమేష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకొన్నారు. జైపాల్ రెడ్డిని గుర్తు చేసుకొంటూ కన్నీళ్లు ఆపుకొనే ప్రయత్నం చేశారు. రమేష్ కుమార్ తరచూ జైపాల్ రెడ్డిని కలిసేవాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. బలవంతంగా కన్నీళ్లు ఆపుకొంటూ జైపాల్ రెడ్డి పాడె మోసారు. పాడె మోసిన తర్వాత కూడ రమేష్ కుమార్ ఆయనను పదే పదే గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more