Warangal Rape Accused Announced Death Sentence చిన్నారిని చిదిమిన మానవమృగానికి ఉరిశిక్ష..

Warangal rape accused announced death sentence

K Praveen, Warangal Court, Hanmakonda, Kumarpally village, death sentence for murder, Telangana crime news, Telangana

The Warangal Court delivered a sensational judgment awarding death sentence to a youth who raped and murdered a nine-months infant in June. Praveen, of Kumarpally village in Hanmakonda, was drunk when he had resorted to the heinous offence.

చిన్నారిని చిదిమిన మానవమృగానికి ఉరిశిక్ష.. వరంగల్ కోర్టు సంచలన తీర్పు..

Posted: 08/08/2019 06:51 PM IST
Warangal rape accused announced death sentence

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన 9నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో వరంగల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 40 రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన న్యాయస్థానం అంతా ఆశించిన విధంగానే నిందితుడికి మరణ శిక్ష విధించింది. అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన కామాంధుడు అత్యాచారం చేసి ప్రాణాలు తీశాడు. అసలు ఆరోజు ఏమైందంటే...

చిన్నారి తల్లిదండ్రులు జగన్, రచన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసముంటున్నారు. జగన్ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుండగా, రచన గృహిణి. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత పుట్టిన పాపకు శ్రీహిత అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. జూన్ నెలలో పాపకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వేములవాడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హన్మకొండలోని పాప అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. జూన్ 19వ తేదీన రాత్రి ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో అంతా డాబాపై పడుకున్నారు.

ఈ విషయాన్ని గమనించిన ప్రవీణ్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండటంతో చంపేశాడు. చిన్నారి పక్కన లేకపోవడంతో కంగారుపడిన జగన్, రచన చుట్టపక్కల వెతికారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ప్రవీణ్ పాపతో కనిపించడంతో అతడిని చితక్కొట్టి చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

అయితే పాప అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి 366, 302, 376ఎ, 376 ఏబీ, 379 ఐపీసీ సెక్షన్లతో పాటు 5(ఎం) రెడ్‌విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K Praveen  Warangal Court  Hanmakonda  Kumarpally village  death sentence  Crime  

Other Articles