బ్యాంకుల కన్నా పోస్టాఫీసుల మేలు. వీటిల్లో డబ్బు డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీ పొందొచ్చు. అలాగే భద్రతకు కూడా ఎలాండి ఢోకా లేదు. పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించాలంటే కేవలం రూ.20 ఉంటే సరిపోతుంది. పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా తెరవొచ్చు. ఏడాదికి 4 శాతం వడ్డీ పొందొచ్చు.
పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు..
* నగదు రూపంలో డబ్బులిచ్చి ఈ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు.
* చెక్ బుక్ ఫెసిలిటీ లేని అకౌంట్‌దారులు ఖాతాలో కనీసం రూ.50ను మినిమమ్ బ్యాలెన్స్ కింద కలిగి ఉండాలి.
* అదే చెక్ బుక్ కలిగి ఉంటే మినిమమ్ బ్యాలెన్స్ రూ.500. అకౌంట్లో కనీసం ఈ మొత్తాన్ని కలిగి ఉండాలి.
* చెక్ బుక్ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరమైతే వారు ఈ సేవలు పొందొచ్చు.
* అకౌంట్‌పై పొందిన వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఏడాదిలో రూ.10,000 వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు.
* ఖాతాకు నామినేషన్ సౌకర్యం కూడా ఉంది. అకౌంట్ ప్రారంభించేటప్పుడు లేదా తర్వాత అకౌంట్‌కు నామినీని చేర్చుకోవచ్చు.
* అకౌంట్‌ను ఒక పోస్టాఫీస్ నుంచి మరొక పోస్టాఫీస్‌కు మార్చుకోవచ్చు. ఒక పోస్టాఫీస్‌లో ఒకే అకౌంట్‌ను తెరవగలం.
* పిల్లల పేరుపై కూడా అకౌంట్ తెరవొచ్చు. అలాగే జాయింట్ అకౌంట్ సౌలభ్యం కూడా ఉంది.
* అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కసారైనా అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాలి. లేదంటే విత్‌డ్రా అయినా చేసుకోవాలి.
* సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా.. జాయింట్ అకౌంట్‌ను సింగిల్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు.
* ఏటీఎం ఫెసిలిటీ అందుబాటులో ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more