టెలికాం చరిత్రలో సృష్టించిన జియో నెట్ వర్క్ ప్రస్తుతం మరో సంచలనానికి తెర లేపింది. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ”జియో గిగా” ఫైబర్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలతో ఈ రంగంలో రూపురేఖలను మార్చివేసింది. రిలయన్స్ జియో యూజర్లు ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. జియో మూడో వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న జియోగిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తామని ఆయన తెలపారు.
జియో వెల్కమ్ ఆఫర్లో భాగంగా.. ఫరెవర్ ప్లాన్ తీసుకున్న వారికి 4కే రిజల్యూషన్‌తో కూడిన హెచ్డీ ఎల్ఈడీ టీవీలను, సెట్ టాప్ బాక్సులను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. రిలయన్స్ యాన్యువల్ జనరల్ మీటింగ్ సందర్భంగా ముకేశ్ అంబానీ ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే ఐదు లక్షల నివాసాల్లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే 12 నెలల్లో గిగాఫైబర్ సేవలను దేశమంతటా అందిస్తామన్నారు. ఆగష్టు 15 నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామన్నారు.
జియో ఫరెవర్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ముకేశ్ అంబానీ పూర్తిగా వెల్లడించలేదు. కానీ దీర్ఘకాలిక జియో గిగాఫైబర్ ప్లాన్లను ఎంపిక చేసుకున్న వారికి ఉచితంగా టీవీలను అందజేస్తామని మాత్రం ప్రకటించారు. ఏ బ్రాండ్ టీవీలను ఇస్తారు, సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. రిలయన్స్ గిగాఫైబర్‌లో 100 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ వరకు స్పీడ్‌తో ఇంటర్నెట్ అందజేస్తారు.
జియో గిగాఫైబర్ సర్వీస్ ద్వారా ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్, ఇంటర్నెట్, డిజిటల్ సెట్‌టాప్ బాక్స్, అల్ట్రా హై డెఫినిషన్ ఎంటర్టైన్మెంట్, వర్చువల్ కంటెంట్, ఇంటరాక్టివ్ గేమింగ్, స్మార్ట్ హోమ్ సొల్యూషన్లను అందజేయనున్నారు. దేశంలో 2 కోట్ల మందికి గిగాఫైబర్ సేవలను అందిస్తామని అంబానీ తెలిపారు. జియో ఫైబర్ ప్లాను నెలకు రూ.700 నుంచి రూ.10 వేల వరకు ఉంటాయని అంబానీ తెలిపారు.
జియో ఫైబర్ కోసం ఇప్పటికే 15 మిలియన్ల రిజిస్ట్రేషన్లు వచ్చాయన్నారు. జియో ఫైబర్ కస్టమర్లు సినిమాలు రిలీజైన రోజునే ఇంట్లో నుంచే వాటిని చూడొచ్చాన్నారు. క్లౌడ్ డేటాసెంటర్ల ఏర్పాటు కోసం రిలయన్స్, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయని ముకేశ్ అంబానీ తెలిపారు. ఐటీ స్టార్టప్‌లకు జియో-అజుర్ సేవలను ఉచితంగా అందజేస్తామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more