IndiGo flight carrying Nitin Gadkari fails to take off due to glitch నితిన్ గడ్కారీతో బయల్దేరిన విమానానికి తృటిలో తప్పిన ముప్పు

Indigo flight carrying nitin gadkari aborts minutes before take off

ndiGo, indiGo flight, IndiGo nagpur to delhi flight, IndiGo flight Nitin Gadkari, error in IndiGo flight, Niitn Gadkari in IndiGo flight, IndiGo flight grounded, IndiGo flight aborted

An IndiGo going from Nagpur to Delhi was returned to the taxiway from runway after it developed a serious technical error. Union Transport Minister Nitin Gadkari was also onboard the flight.

నితిన్ గడ్కారీతో బయల్దేరిన విమానానికి తృటిలో తప్పిన ముప్పు

Posted: 08/13/2019 02:37 PM IST
Indigo flight carrying nitin gadkari aborts minutes before take off

కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీకి తృటిలో ప్రమాదం తప్పిపోయింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్దినిమిషాల్లోనే అది తిరిగి ల్యాండ్ అయ్యింది. అదే విమానంలో ఏకంగా 143 మంది ప్రయాణికులతో పాటు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ కూడా వుండటంతో ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.

విమాన ప్రయాణాలు కూడా ప్రస్తుతం క్షేమకరం కాదని వార్తలు వెలువడుతున్న క్రమంలో ఇలాంటి మరో ఘటన అందోళన రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే, నాగపూర్ నుంచి న్యూఢిల్లీకి ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం (6ఈ 636) టేకాఫ్ కు సిద్ధమైంది. అలా టేకాప్ వెళ్తున్న క్రమంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలట్ కు అర్థమైంది. వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి తెలిపిన పైలట్, విమానం టేకాఫ్ ను నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించారు.

ఆ సమయంలో విమానంలో గడ్కరీ సహా 143 మంది ఉన్నారని, విమానంలో టెక్నికల్ సమస్య ఏర్పడిందని ఇండిగో యాజమాన్యం ధ్రువీకరించింది. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, ప్రయాణికులందరూ సురక్షితమేనని నాగపూర్‌ ఎయిర్ పోర్టు సీనియర్‌ డైరెక్టర్‌ విజయ్‌ మూలేకర్‌ మీడియాకు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IndiGo  Indigo Airlines  indigo pilot  Nitin Gadkari  Union Minister  Roads and Buildings  crime  

Other Articles