pawan kalyan sensational allegations on Political Party జనసేన విలీనం కోసం తీవ్ర ఒత్తిడి: పవన్

Pawan kalyan sensational allegations on national political party

Pawan Kalyan, Janasena, west godavari, key leaders meeting, review meeting, pawan kalyan sensational allegations, BJP, amit Shah, Ram Madhav, Kanna Laxminarayana, YSRCP, CM Jagan, Andhra Pradesh, Politics

Jana Sena party President Pawan Kalyan made sensational allegations on a national poitical party, which is forcing hm to ammulgamate his party into it.

జనసేన విలీనం కోసం ఓ జాతీయ పార్టీ తీవ్ర ఒత్తిడి: పవన్ కల్యాణ్

Posted: 08/16/2019 07:37 PM IST
Pawan kalyan sensational allegations on national political party

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే తన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయబోనని తేల్చిచెప్పిన ఆయన తాజాగా తాజాగా మరోమారు అదే అంశమై మాట్లాడారు. జనసేనను కలిపేయాలంటూ ఒక జాతీయ పార్టీ తనపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తోందని చెప్పారు. అయితే, ఏ పార్టీలోనూ జనసేనను విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మానవతా విలువల కోసం, జాతి సమగ్రతను కాపాడటం కోసమే జనసేనను ప్రారంభించామని... అందుకే మరే పార్టీలో జనసేనను కలపబోమని తెలిపారు.

తన బలమేంటో, బలహీనత ఏంటో తనకు తెలుసని పవన్ చెప్పారు. సత్యం కోసం తాను పని చేస్తానని తెలిపారు. ఏ విషయంలోనైనా ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే చెప్పాలని... అలా కాకుండా, రోడ్ మీదకు వెళ్లో, సోషల్ మీడియాలో పోస్టుల పెట్టడం ద్వారానో చెబితే వినడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదని అన్నారు. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో ఆయన పాల్గోన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. జనసైనికులంతా వరద బాధితులకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం కూడా చోటుచేసుకుంది. పవన్ తో ఫొటోలు దిగడానికి జనసైనికులు ఆసక్తి చూపారు. దీంతో ఆయన మాట్లాడుతూ, మీతో ఫొటోలు దిగడానికి తనకు ఇబ్బందేమీ లేదని... అయితే, అందరూ ఒకేసారి మీద పడిపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చమత్కరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  allegations  BJP  amit Shah  Ram Madhav  Andhra Pradesh  Politics  

Other Articles