ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న చిదంబరం ఆ అజ్ఞాతం వీడక తప్పదనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి మరో షాక్ తగిలినట్టయింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన ముందు జాగ్రత్తతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయినా ఆయన దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అత్యవసరం కింద తనకు ముందస్తు బెయిల్ పిటీషన్ మంజూరు చేయాలని ఆయన అత్యున్నత న్యాయస్థానంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు.
మాజీ కేంద్రమంత్రి పిటీషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తి.. జస్టిస్ ఎన్వీ రమణ.. చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను అత్యవసరం కింద విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దీంతో అక్కడ కూడా మాజీ విత్త మంత్రికి నిరాశే ఎదురైంది. అయితే డిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ధర్మాసనానికి పంపినట్లు జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. దీంతో పిటిషన్ను అత్యవసరంగా విచారించాలా.. వద్దా అనేది లంచ్ తర్వాత సీజేఐ నిర్ణయించనున్నారు.
ఇదిలా ఉండగా నిన్న హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఐఎన్ఎక్స్-మీడియా కేసులో చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు సీబీఐ, ఈడీ రంగంలోకి దిగింది. దీంతో చిదంబరం తరపు లాయర్ కపిల్ సిబాల్ సీబీఐకి లేఖ రాశారు. సుప్రీం కోర్టు విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని చిదంబరం తరపు లాయర్ సీబీఐకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. అయితే చిదంబరం ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. దీంతో ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
దీంతో చిదంబరం విదేశాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతుంది. ఈ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారు. 2007లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఇక దీంతో పాటు చిదంబరం పలు ప్రతిపాదనలు అమలులో, కొనుగోళ్లలో ముడుపులు అందుకున్నారని ఈడీ అధికారులు అరోపణలు చేస్తున్నారు.
చిదంబరం ముందస్తు బెయిల్ పిటీషన్ 23కు వాయిదా:
ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి ముందుకు ముందస్తు బెయిల్ వ్యవహారం వెళ్లగా ఆయన బెయిల్ పిటీషన్ ను (శుక్రవారం) ఈ నెల 23కు వాయిదా వేశారు. అంతకుముందు.. చిదంబరం బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ ఎదుట వాదనలు కొనసాగాయి.
సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే తీర్పు ఇవ్వడానికి నిరాకరించారు జస్టిస్ రమణ.. దీనిపై చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఐఎన్ఎక్స్ వ్యవహారంలో చిదంబరాన్ని వ్యక్తిగతంగా ప్రశ్నించాల్సిందే అంటున్న ఈడీ, సీబీఐ.. అయోధ్య కేసు వాదనలో చీఫ్ జస్టిస్ బిజీగా ఉన్నందున ఇవాళ చిదంబరం పిటిషన్పై ఎంత వరకు నిర్ణయం తీసుకుంటారన్నదే అనుమానమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more