అద్భుతాల నెలవు మన దేశం. మన దేవాలయాలు అన్న చెప్పడం అతిశయోక్తి కాదు. ఎంతో ప్రాశస్తమైన దేవాలయాల్లో ఎన్నెన్నో మహిమలు కూడా వున్నాయి. ఒక్కో దేవాలచానికి ఒక్కో పురాణ ఐతిహ్యం వుంది. ఎంతో విశిష్టమైన మన దేవాలయాల్లో ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలకు కూడా నెలవుగా మారాయి. ఒక్కో అద్బుతం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ అద్భుతాలు తెలిసిన వారు వాటిని మిగతావారితో పంచుకుంటారు. నిజంగా అలా జరిగిందా అని వారు ఆశ్చర్యపోతుంటారు. ఇలాంటి అద్భుతమే ఒకటి హైదరాబద్ లోని దేవాలయంలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ లోని మీర్ ఆలం మండిలో ఉన్న శ్రీ మహాంకాళేశ్వర స్వామి మందిరంలో దుర్గామాత ఆలయం కూడా వుంది. అందులోని దుర్గ మాతా దేవి విగ్రహం ఎంతో నిండుగా వుంటుంది. నిజం చెప్పాలంటే ఆ విగ్రహాన్ని చూస్తూ వుండిపోవాలనిపిస్తోంది. అయితే ఆమ్మవారి విగ్రహాన్ని తధేకంగా చూస్తూ వున్న ఓ భక్తుడు అక్కడ నిల్చున్నాడు. అప్పుడే హారతి సమయం ఆసన్నమవ్వడంతో పూజారి వచ్చి అమ్మవారికి హారతి ఇచ్చాడు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహాన్ని చూస్తున్న భక్తుడు అమ్మవారి విగ్రహంలో మార్పులను గమనించాడు. అదేంటే హారతి జ్యోతుల వెలుగులకు అనుగూణంగా అమ్మవారి విగ్రహం ముఖకవళికలు మారిపోవడం గమనించాడు.
తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని, తాను చూసింది నిజమేనా అనే సంశయంలో పడ్డాడు. మరుసటి రోజున మరలా హారతి సమాయానికి వచ్చిన భక్తుడు.. హారతి ఇచ్చే సన్నివేశాన్ని వీడియోగా తీశారు. వీడియోలో తాను చూసింది నిజమే అని నిర్ధారించుకున్నాడు. హారతిని విగ్రహం చుట్టూ తిప్పే సమయంలో అమ్మవారి ముఖం కోపంగా, శాంతంగా, చిరునవ్వు చిందిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. దాదాపు 53 వేలమందికి పైగా వీడియోను చూశారు. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను చూసేయండీ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more