వినాయక చవితి పండగ వచ్చేసింది. మరికొన్ని గంటల వ్యవధిలో యావత్ ప్రపంచలోని హైందవ భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్దలతో గణేష్ చతుర్థిని నిర్వహించుకుంటారు. భక్తులు తమ శక్తికొద్ది విఘ్నేశ్వరుడి విగ్రహాలను తీసుకునివచ్చి.. తమ ఇళ్లలో ప్రతీష్టించి పూజలు నిర్వహిస్తారు. భగవంతుడికి ఇష్టమైన జిల్లేడి, మారేడు, తులసి, తదితర 21 ఆకులు, పండ్లు సమర్పిస్తారు. వీటితో పాటు పిండివంటలు చేసి భగవంతుడికి నైవేద్యాన్ని నివేదిస్తారు. ఇళ్లలోని విషయాలను పక్కనబెడితే.. ఇక యువత ముఖ్యంగా ఈ పండుగను వీధుల్లో సంబరంగా నిర్వహిస్తారు.
స్థానికుల నుంచి చందాలను వసూలు చేసి మరీ తమ వీధిలోని వినాయకుడే ఆకర్షణీయంగా వుండేలా మంచి విగ్రహాన్ని ఎంపిక చేసుకోవడంతో పాటు.. మంచి కార్యక్రమాలను నిర్వహణ, రుచికరమైన ప్రసాదాలు పంఫిణీ ఇత్యాదులను నిర్వహించి.. స్థానికుల చేత ఔరా అనిపించుకుంటారు. ఇప్పటికే రకరకాల ఆకారాల్లో వినాయక విగ్రహాలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ముంబై నగరంలో పూజలు అందుకునే గణపయ్యలను వివిధ ఆకారాల్లో తయారు చేస్తుంటారు. లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టుగా వినాయకులను తయారు చేస్తుంటారు.
ఇదే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అత్యంత రద్దీగా ఉండే దేవాలయాల్లో లాల్ బాగ్చా దేవాలయం ఒకటి. అక్కడ ప్రతి ఏడాది భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాదు.. అక్కడ ఏర్పాటు చేసే వినాయకుడు చాలా కొత్తగా ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంటాడు. ఈసారి వినాయక చవితికి చంద్రయాన్ 2 గణపతిని ఏర్పాటు చేశారు. గణపతి విగ్రహం పైనా ఇద్దరు వ్యోమగాములు .. విగ్రహం తల వెనక భాగంలో చంద్రయాన్ 2 ఉపగ్రహం..విగ్రహానికి వెనుక భాగంలో తెరను ఏర్పాటు చేసి.. చంద్రయాన్ 2 లాంచింగ్ కు సంబంధించిన విషయాలను చూపుతున్నారు. భారత ఖ్యాతిని గ్రహాంతరాలకు వ్యాపింపజేసిన ఇస్రోకు గుర్తుగా ఇలా వినాయకుడిని అక్కడ ప్రదర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more