Telangana BJP neta’s son Body found in UK లండన్ లో అదృశ్యమైన శ్రీహర్ష మృతదేహం లభ్యం!

Body found in uk could be of telangana bjp neta s son

Shriharsha, Ujwal sriharsha sanne, Sanne Uday Pratap, Queen Mary University of London, Beachy Head, artificial intelligence, United Kingdom, London, Khammam, BjP President, Telangana, Crime

A body has been found at a notorious suicide spot in Britain that is believed to be that of the missing son of a Telangana BJP leader. Ujwal Sriharsha Sanne (24), who hails from Khammam in Telangana and was studying a master’s in London, went missing on August 21.

లండన్ లో అదృశ్యమైన బీజేపి నేత కుమారుడి విషాదాంతం.!

Posted: 09/03/2019 04:19 PM IST
Body found in uk could be of telangana bjp neta s son

లండన్ లో పది రోజుల క్రితం మిస్ అయిన తెలంగాణ యువకుడు శ్రీహర్ష అదృశ్యం విషాదాంతమైంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా బీజేపి అధ్యక్షుడైన సన్నె ఉదయ్ ప్రతామ్ కుమారుడు సన్నె ఉజ్వల శ్రీహర్ష మృతదేహం లండన్ బీచ్ సమీపంలో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. సముద్రంలో వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగేందుకు బీచ్ వద్దకు చేరుకున్న పోలీసులు... మృతదేహం శ్రీహర్షదని నిర్ధారించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అయితే తన కుమారుడు అదృశ్యమైయ్యారన్న వార్త తెలియగానే అన్వేషణలో అక్కడి పోలీసులకు సాయంగా వుండాలని ఇప్పటికే లండన్ చేరుకున్న ఉదయ్ ప్రతాప్ తన కొడుకు మృతదేహాన్ని గుర్తించారని సమాచారం. కాగా, గత పది రోజులుగా సాగుతున్న గాలింపు చర్యలు ఆయన మృతదేహం లభ్యం కావడంతో విషాదంగా ముగిసాయి. తన కొడుకు ఎక్కడో ఓ చోట బతికే ఉన్నాడన్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. ఉన్నత చదువుల కోసం ఖండాంతరాలు దాటి వచ్చిన కొడుకు చివరిచూపు కూడా మిగల్చకుండా అనంతలోకాలకు తరలివెళ్లడంపై కన్నవారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

దీంతో ఖమ్మం జిల్లా బీజేపీ నేత కుమారుడు మరణించాడని, ఆయన బౌతికకాయం లండన్ బీచ్ వద్ద లభ్యమైందని.. త్వరలోనే ఆయన మృతదేహాన్ని భారత్ కు తరలిస్తున్నారన్న వార్త తెలియగానే అధ్యక్షుడు ఉదయ్ ప్రతాప్ ఇంట్లో రొదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు కొడుకు మరణవార్త విని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించారు. పలువురు బీజేపీ నేతలు, బంధువులు, మిత్రులు, స్థానికులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. శ్రీహర్ష కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే ఉదయ్ ప్రతాప్ కుటుంబసభ్యులు, బంధువులు రోదనలతో స్థానికులను సైతం కంటతడిపెట్టించాయి. కాగా, వీలైనంత త్వరగా శ్రీహర్ష మృతదేహాన్ని ఇండియాకు తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు భారత విదేశాంగశాఖ అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles