హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయంగా చక్కని గుర్తింపును తెచ్చుకుంటోందని సంబరపడుతున్న క్రమంలోనే అంతకుమించిన నేరగాళ్లు కొత్త పంథాలతో నేరాలకు పాల్పడటంతో సంబరం అవిరైపోతుంది. తాజాగా శంషాబాద్ లో జరిగిన ఘటన ఇలాంటిదే. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లి.. తన స్వగ్రామానికి తిరిగివస్తున్న ఓ ప్రయాణికుడిపై క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. తన కారులో ఎక్కిన ప్రయాణికుడు స్వదేశానికి చేరుకుంటున్నాన్న అలోచనలో నిమగ్నం కాగానే.. అతడి దారిమళ్లించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి.. అతని వద్దనున్న డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు.
2015 ఆ మధ్యకాలంలో కొందరు హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు చేసిన ఘటనలతో వారంటేనే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఇలాంటి ఘటనలు వారిపై ఉన్న నమ్మకాన్ని కూడా పొగొట్టేలావున్నాయి. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వగ్రామానికి క్యాబ్ లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. తన పెళ్లి నిమిత్తం యునైటెడ్ కింగ్ డమ్ నుంచి కొంగ్రోత్త ఆశలతో, ఆలోచనలో హైదరాబాద్ లో అడుగుపెట్టిన ప్రయాణికుడిని.. బాధితుడిలా మార్చేశాడు క్యాబ్ డ్రైవర్. అతనిపై దాడి చేసి.. బంగారం 2 లక్షల యూకే కరెన్సీని తీసుకుని ఉడాయించాడు.
బాధితుడు ప్రవీణ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. తాను గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నానని.. తానున్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు వెల్లడించాడు. వెంటనే బాధితుడి బందువులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడి స్వగ్రామం దమ్మాయిగూడ. 15 రోజుల్లో తన వివాహం ఉండటంతో బాధితుడు యూకే నుంచి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన సంచలనం రేపింది. చాలామంది నగరవాసులు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. ఓలా, ఉబెర్ క్యాబుల్లో జర్నీ చేస్తున్నారు. ఈ ఉదంతంతో వారంతా హడలిపోతున్నారు. సేఫ్ గా ఉంటుందని భావించిన క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. అలాంటిది క్యాబ్ డ్రైవరే దారుణానికి ఒడిగట్టడం షాక్ కు గురి చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more