Setback to Chidambaram as SC Refuses Anticipatory Bail చిదంబరానికి ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరించిన ‘సుప్రీం’

Setback to p chidambaram as sc refuses anticipatory bail in ed s case

2018 Supreme Court order on mining, chidambaram news,chidambaram p, ED, chidambaram Latest News, Indrani Mukerjea, INX Media,INX Media case,Kapil Sibal,Karti Chidambaram, p chidambaram cbi case,P Chidambaram hearing,p chidambaram, p chidambaram news,P. Chidambaram, Supreme Court,Tushar Mehta,what is inx media case, Crime, Politics

In more trouble for former finance minister P Chidambaram, the Supreme Court refused him anticipatory bail in the INX Media case lodged by the Enforcement Directorate (ED).

చిదంబరానికి ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరించిన ‘సుప్రీం’

Posted: 09/05/2019 10:54 AM IST
Setback to p chidambaram as sc refuses anticipatory bail in ed s case

ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో... మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు ఈ కేసుపై విచారణ జరుపుతున్న తరుణంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వల్ల కేసుకు సంబంధించిన ఆధారాలనూ తారుమారు చేయలేరన్న దర్యాప్తు సంస్థల ఆభియోగాలను ఖండించగలిగే సాక్ష్యాలను చూపించగలిగే పరిస్థితుల్లో లేరనీ న్యాయస్థానం అభిప్రాయపడింది..

అలాగే... ఈడీ అధికారులు కూడా కాంగ్రెస్ సీనియర్ నేతకు సంబంధించిన వివరాలన్నీ కోర్టుకు సమర్పించే పరిస్థితుల్లో లేదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు వీలయ్యే కేసు ఇది కాదన్న సుప్రీంకోర్టు... దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కి స్వేచ్ఛగా దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడింది. ముందస్తు బెయిల్ ఇస్తే... దాని ప్రభావం దర్యాప్తుపై పడే ప్రమాదం ఉంటుందని తెలిపింది. చిదంబరం... సాధారణ బెయిల్ కోసం... కింది కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది సుప్రీంకోర్టు.

2007లో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపుకి విదేశాల నుంచీ రూ.305 కోట్లను అనుమతిస్తూ... ఎఫ్ఐపిబి క్లియరెన్స్ ఇచ్చిన విషయంలో అవినీతి జరిగిందని.. మే 15, 2017న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఈ కేసులో 2017లో ఈడీ... అక్రమ డబ్బు తరలింపు (మనీ లాండరింగ్) కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ఆగస్ట్ 20న చిదంబరం పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హోకోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించడంతో... చిదంబరం మరిన్ని చిక్కుల్లో పడినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  chidambaram  inx media  Indrani Mukerjea  Kapil Sibal  Tushar Mehta  Crime  Politics  

Other Articles