చట్టానికి ఎవరూ అతీతులు కాదన్న విషయం మరోమారు రూడీ అయ్యింది. మొన్నామధ్య ఇన్ ఆర్బీట్ మాల్ వద్ద జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు రోడ్డుపైనే నిలిపివేయడంతో సైబరాబాద్ పోలీసులు చాలానా వేసిన విషయం తెలిసిందే. ఇక నవాబ్ పేట్ ఎమ్మెల్యే యాదయ్య కారును కూడా ఆపి జరిమానా విధించడంతో పాటు బ్లాక్ ఫిల్మ్ తీయించారు. అంతేకాదు నగరం పోలీసులు సినీనటులు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా టాలీవుడ్ పెద్దహీరోలకు కూడా జరిమానా విధించి విషయం తెలిసిందే.
దీంతో చట్టం ముందు అందరూ సమానులేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. అయితే ఇది అందరికీ వర్తిస్తుందేమోకానీ పోలీసు ఉన్నతాధికారులు మాత్రం కాదు. అంతేందుకు పోలీసులే దర్జాగా తమ పోలీసు శాఖ వాహనాలను వేసుకుని రాంగ్ రూట్లో వెళ్తుంటారు. వారినెవరు ప్రశ్నిస్తారు అంటారా.? సారీ.. పోలీసుల వాహనాలే కాదు ఉన్నతాధికారుల వాహనాలను అంతేందుకు ఏకంగా పోలీస్ బాస్ వాహనానికే తమ బాస్ కారునే వదల్లేదు. అదేంటి వాళ్ల బాస్ ఎవరూ అంటారా.?
తెలంగాణ రాష్ట్ర పోలిస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి అన్ని విషయం తెలిసిందే, ఆయన కారు రాంగ్ రూట్ లో వెళ్లినా టాఫిక్ పోలీసులు వదిలేయలేదు.. జరినామా విధించి శభాష్ అనిపించుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ఈ నెల 3న డీజీపీకి చెందిన కారు సంగారెడ్డిలో రాంగ్ రూట్ లో వెళుతుండగా ఎవరో సామాన్యుడు ఫొటో తీసి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో కారు వివరాలను పోలీసులు ఆరా తీయగా, అది తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి పేరుపై ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల మేరకు రూ.1,135 ల జరిమానా విధించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more