వినాయక ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో గణేషుణ్ణి నిమ్జనాలకు తరలివెళ్తున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు భక్త సమాజం సభ్యులు. అటు ప్రభుత్వం కూడా నిమజ్జనాలకు పూర్తి ఏర్పాటు చేసింది. కాగా, ఈ నెల 12న గురువారం రోజు హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జోనోత్సవం జరగనుంది. బాలాపూర్ గణేశ్ మొదలుకొని, ఖైరతాబాద్ వినాయకుడు సహా వేల సంఖ్యలో విగ్రహాలను నగరంలోని వివిధ చెరువుల్లో నిమజ్జనం చేయనున్నారు.
దీనికోసం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు గణేశ్ నిమజ్జనానికి నగర పోలీసులు కూడా అంతా సిద్ధం చేశారు. ఊరేగింపులు ప్రశాంతంగా జరగడం కోసం కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనంలో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు, గణేశ్ శోభాయాత్రకు సంబంధించి ట్రాఫిక్ అదనపు డీసీపీ అనిల్ కుమార్ మంగళవారం వివరాలు వెల్లడించారు.
బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర 18 కిలోమీటర్ల మేర ఉంటుందని తెలిపారు. గణేశ్ శోభాయాత్రకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శోభాయాత్రకు 17 ప్రధాన మార్గాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సుమారు 10వేల లారీలతో గణేశ్ నిమజ్జనం సాగుతుందని తెలిపారు. చిన్న చిన్న గణేష్ విగ్రహాలను ట్యాంక్ బండ్ మీదకు అనుమతి లేదని తెలిపారు. హైదరాబాద్‌లో నిమజ్జనోత్సవానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు వస్తున్నారని పేర్కొన్నారు.
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
గణేశ్ నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నట్లు అదనపు డీసీపీ అనిల్ కుమార్ తెలిపారు. ప్రైవేట్ వాహనాలను నగరంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. ప్రైవేట్ వాహనాల పార్కింగ్ కోసం నగర వ్యాప్తంగా 10 ప్రాంతాలను ఎంపిక చేశామని వెల్లడించారు. నిజాం కాలేజ్, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ చేసుకోవచ్చని తెలిపారు.
అయినప్పటికీ.. నగరవాసులు వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టునే ఉపయోగించాలని సూచించారు. నిమజ్జనాలు చూసేందుకు వచ్చేవారు మెట్రోలో ప్రయాణించండం మేలని అనిల్ కుమార్ చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే ప్రయాణికులు నగర శివార్ల నుంచి ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ సమాచారం కోసం మూడు టోల్ ఫ్రీ నంబర్లతోపాటు గూగుల్ మ్యాప్ ద్వారా పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more