తెలంగాణ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేసే కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి బడ్జెట్ నేపథ్యంలో చంద్రయాన్-2లో చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ.. కేసీఆర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదేమో అనే అనుమానం కలుగుతోందటూ ఎద్దేవా చేశారు. అక్షరాస్యత కల్పించడంలో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగులో ఉందని అమె విమర్శించారు. రాష్ట్రంలో విజృంభించిన విష జ్వరాలు, యూరియా కొరతతో రైతులు పడ్డ ఇబ్బందులపై ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు.
తాజాగా, మంత్రివర్గ విస్తరణతో టీఆర్ఎస్ నేతల్లో పెరిగిన అసంతృప్తిపై విజయశాంతి ఫేస్బుక్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసస గళాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. 19 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు కేబినెట్‌ను విస్తరించిన తర్వాత తలెత్తిన అసమ్మతి గుర్తుకు వస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘అప్పటివరకు తనకు తిరుగులేదు అనుకున్న చంద్రబాబుకు, అప్పట్లో జరిగిన కేబినెట్ విస్తరణ తర్వాత గడ్డు రోజులు మొదలయ్యాయి. తనకు మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్ గారు తిరుగుబాటు చేయడం... చివరకు అది టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చిన వైనాన్ని ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు చూస్తున్న వారందరికీ కూడా, గతంలో చంద్రబాబు గారికి ఎదురైన అనుభవమే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా ఎదురు అవుతుందన్న అభిప్రాయం కలుగుతోంది.’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
మొదటినుంచి టిఆర్ఎస్ను అంటిపెట్టుకున్న తమను విస్మరించారు అన్న అసమ్మతి ఓవైపు... పదవుల కోసం పార్టీ మారిన తమను పట్టించుకోలేదన్న అసహనం మరోవైపు.. మొత్తంమీద కేసీఆర్ గారి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారిందంటూ సెటైర్లు వేశారు. నా మాటే శాసనం అనుకున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా ధిక్కార స్వరాలను వినిపించేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆపార్టీ నేతలు ఏమాత్రం వెనకాడటం లేదన్నారు.
అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలను బెదిరించి... వారితో తనకు మద్దతుగా ప్రకటనలు చేయించుకుంటూ కేసీఆర్ సంక్షోభ నివారణకు ప్రయత్నాలు చేయవచ్చు కానీ.. రోజురోజుకు పెరిగే అసంతృప్తిని అడ్డుకోవడం ఆయన తరం కాదని విజయశాంతి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్లో వినిపిస్తున్న నిరసన గళాన్ని చూస్తూ ఉంటే.. గతంలో మాదిరిగా కేసీఆర్ పేరు చెబితే భయపడే రోజులు పోయాయనే విషయం స్పష్టంగా అర్థం అవుతోందని పేర్కొన్నారు.
‘తను కనుసైగ చేస్తే వణికిపోయే పరిస్థితి నుంచి.. తనకు వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి టీఆర్ఎస్లో అసమ్మతి వర్గం పెరుగుతోంది అంటే.. దాని వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటో కేసీఆర్ కు ఇప్పటికే అర్థమై ఉంటుంది’ ఫేస్ బుక్ లో రాసుకొచ్చారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి, సంబరపడిన గులాబీ బాస్‌కు ఇప్పుడు అదే అనుభవం బీజేపీ రూపంలో పునరావృతం అవుతుంది అనే వాదన వినిపిస్తోందన్నారు. రోజువారి పరిణామాలు కూడా ఈ వాదాన్ని బలపరిచే విధంగానే ఉన్నాయంటూ విజయశాంతి అభిప్రాయపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more