Will teach lesson to TDP leaders: YSRCP టీడీపీ నేతలకు తగిన గుణపాఠం నేర్పుతాం: వైసీపీ

Will teach lesson to tdp leaders if they don t change their behaviour ysrcp

YSR Congress Party, chalo atmakur rally, Kasu Mahesh Reddy, Mopidevi VenkataRamana, Y. S. Rajasekhara Reddy, Telugu Desam Party, Nara Lokesh, Chandrababu Naidu, Guntur, Vijayawada, Andhra Pradesh

YSRCP leader Kasu Mahesh Reddy said that TDP leaders continue to think that their party is still in power. "They must change their behaviour else they will be taught a lesson," said Reddy.

ఫెయిడ్ అర్టిస్టులతో చంద్రబాబు డ్రామాలు.. తిప్పికొడతాం: వైసీపీ

Posted: 09/11/2019 03:23 PM IST
Will teach lesson to tdp leaders if they don t change their behaviour ysrcp

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో పెయిడ్ ఆర్టిస్టులతో టీడీపీ అధినేత చంద్రబాబు డ్రామాలు ఆడిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలందరూ ఆత్మకూరుకు వస్తారని, టీడీపీ బాధితులతో ఆందోళన చేపడతామని వ్యాఖ్యానించారు. టీడీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పల్నాడును ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు.పల్నాడు గురించి చంద్రబాబుకు ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు.

వైఎస్ఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో పల్నాడు అభివృద్ధి జరిగిందన్నారు. జగన్ సీఎం అయిన మూడు నెలల్లోనే పల్నాడులో మెడికల్ కాలేజీ మంజూరు చేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పి, అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. చివరికి అసెంబ్లీ ఫర్నీచర్ కూడా ఎత్తుకెళ్లిన చరిత్ర టీడీపీ నేతలది అని ఎద్దేవా చేశారు. పల్నాడుపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను మొదటి సంవత్సరంలోనే అన్నీ అమలు చేస్తామని, జగన్ పాలనను చూసి ఓర్వలేకనే చంద్రబాబు చెత్త రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మహేష్ నిప్పులు చెరిగారు.

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దొంగ దీక్ష, కొంగ జపాలను ప్రజలు నమ్మరని అన్నారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే టీడీపీ నేతలు బెదిరించి కూర్చో బెడుతున్నారని అన్నారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిన సిగ్గు మాలిన రాజకీయం చంద్రబాబుదని మంత్రి మోపిదేవి విమర్శించారు.
 
అచ్చెన్నాయుడు అహంభావంతో పోలీస్ అధికారులను దూషించారని, అచ్చెన్నాయుడు ఇంకా అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారని మంత్రి మోపిదేవి అన్నారు. పోలీస్ అధికారులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఉరుకోమన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కోడెల, యరపతినేని కుటుంబాల చేతిలో పల్నాడు నలిగిపోయిందన్నారు. చంద్రబాబు అప్పుడేం చేశారని ప్రశ్నించారు. జగన్ పాలనలో పల్నాడులో ఒక్క రాజకీయ హత్య కూడా జరగలేదన్నారు. కృష్ణ నీళ్లు వచ్చాయని, యువతకు ఉద్యోగాలు వచ్చాయని, అంత ప్రశాంతంగా ఉన్నారని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  chalo atmakur rally  Kasu Mahesh Reddy  Mopidevi VenkataRamana  TDP  Guntur  Andhra Pradesh  

Other Articles