మన దేశంలో పోలీసులకు అలసు నిందితులను కొట్టే అధికారం లేదని, అంతెందుకు కనీసం తిట్టే అధికారం కూడా లేదని ఓ వైపు చట్టాలు చెబుతుంటే.. చట్టం అంటే తామే అన్నట్లు.. తాము చెప్పిందే శాసనమన్నట్లు వ్యవహరించే పోలీసులు ఇంకా తమ తీరును మార్చుకోవడం లేదు. మతాంతర ప్రేమాయణం కేసు వ్యవహారంలో పోలీసులు ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించి.. మరో వర్గానికి చెందిన అభంశుభం ఎరుగని ముగ్గురు అక్కచెల్లెళ్లపై అమానుషంగా ప్రవర్తించారు.
అసోంలోని దర్రాంగ్ జిల్లాలో పోలీసులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఈ కేసు విషయంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లను పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు వారిని వివస్త్రలను చేసి దారుణంగా చితకబాదారు. అంతేకాదు వారి రహస్య అంగాలపై కూడా పోలీసులు తమ ప్రతాపం చూపారు. మహిళల్లో ఒకరు గర్భిణి అన్న కనీస కనికరం లేకుండా లాఠీలతో చావబాదారు. దీంతో ఆమెకు గర్భస్రావమైంది. మహిళలపై దాడిచేసిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండడం గమనార్హం.
తమ సోదరుడు మతానికి చెందిన యువతిని ప్రేమించి అమెతో కలసి ఈ నెల 7న పారిపోతే.. తామేం తప్పు చేశామని పోలీసులు తమను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించారని బాధిత యువతుల్లో ఒకరు ఏకంగా జిల్లా ఎస్సీ కార్యాలయంలో ఈ నెల 10న పిర్యాదు చేసింది. అయితే ఈ పిర్యాదుపై నామమాత్రంగా స్పందించిన ఎస్సీ.. స్థానిక డీఎస్సీతో విచారణకు అదేశించారు. అయితే విషయం ఆనోటా ఈ నోటా మీడియా చెవిన పడటంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.
తమ నుదిటిపై రివాల్వర్ పెట్టిన పోలీసు ఉన్నతాధికారి తమతో తెల్లని కాయితాలపై సంతకాలు తీసుకున్నారని కూడా బాధిత మహిళ ఎస్సీకి ఇచ్చిన పిర్యాదులో పేర్కోంది. అంతేకాదు పోలీసు అధికారులు బూటుకాలితో పదే పదే తన్నడంతో గర్భవతి అయిన తన సోదరి గర్భస్రావం అయ్యిందని కూడా అవేదనను పిర్యాదులో పేర్కోంది. దీంతో మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులను తక్షం విధుల్లోంచి తొలగించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. .
జిల్లా వ్యాప్తంగా నిరసనలు పెలుల్డిక్కడంతో ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు.. స్థానిక పోలీసు అధికారి (ఎస్ఐ) తో మహిళా కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ వేటు వేశారు. అయితే రంగంలకి దిగిన జాతీయ మహిళా కమీషన్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. బాధిత అక్కాచెల్లెళ్ల సోదరుడు గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించి ఆమెతో కలిసి వెళ్లిపోయాడు. వీరివి వేర్వేరు మతాలు కావడంతో వివాదం పెద్దదైంది. దీంతో యువతి కుటుంబం చేసిన ఫిర్యాదుతో బాధిత మహిళలను, వివాహిత భర్తను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన పోలీసులు వారిని చితక్కొట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more