vijayashanti slams TRS government on debt అప్పుల దిబ్బగా.. బంగారు గనిలాంటి తెలంగాణ : విజయశాంతి

Vijayashanti slams trs government on debt over rs 3 lakh crore

congress campaign commitee chairman, congress leader vijayashanti, senior congress leader, Telangana Debts, Telangana economic situation worst, Telangana schemes and scams, telangana scams, Debts, Schemes, congress, BJP, KTR, Harish Rao, Eetala Rajender, vijayashanti, congress leader, Telengana, politics

Telangana campaign committee chairman VijayaShanti slams TRS government on making the state debts amounting to 3 lakhs crores. Senior Congress leader also stated questioned how KCR is bringing debts and making the people of telangana into its clutches.

అప్పుల దిబ్బగా.. బంగారు గనిలాంటి తెలంగాణ : విజయశాంతి

Posted: 09/23/2019 09:24 AM IST
Vijayashanti slams trs government on debt over rs 3 lakh crore

తెలంగాణ ప్రభుత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శలు గుప్పించే కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ప్రచాక కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోమారు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటూ సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించిన కేసీఆర్... స్కీముల పేరుతో స్కాములు చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని ఆమె ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో ఐదేళ్లలో అప్పుల తెలంగాణను అవిష్కరించారని ధ్వజమెత్తారు.

ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల విషయమై వాస్తవ వివరాలను అడిగితే... అప్పుల పాపం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానిదని, అంతకుముందు అధికాంలో వున్న యూపీఏ ప్రభుత్వానిదోనని చెప్పి తప్పించుకుంటున్నారని అమె దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీల వంటి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని కేసీఆర్ అంటున్నారని.. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అవే జాతీయ పార్టీల చేతులో ఎందుకు 7 సీట్లలో ఓడిపోయింది? అని ఆత్మ విమర్శ చేసుకుంటే బాగుంటుందని సూచించారు.

ఇప్పటికే మూడు లక్షల కోట్ల భారాన్ని మోయలేక తెలంగాణ ఆర్థిక శాఖ సతమతమవుతుంటే... తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీని గల్లంతు చేసేందుకు మరో మూడు స్కీములు తన అమ్ముల పొదిలో ఉన్నాయని కేసీఆర్ చేసిన ప్రకటన చూసి నవ్వాలో? ఏడవాలో? తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదని విజయశాంతి అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన కేసీఆర్... కొత్తగా ప్రకటించబోతున్న స్కీమ్‌లకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తారో? చెప్పాలని అమె నిలదీశారు.

కేసీఆర్ కొత్త పథకాలను ప్రవేశపెట్టి వాటి పేర్లతో గనక మళ్లీ అప్పులు చేయడం మొదలుపెడితే కాంగ్రెస్, బీజేపీల మాట ఏమో కానీ అప్పుల బాధ తట్టుకోలేక ఈసారి తెలంగాణ ప్రజలు గల్లంతైపోయే ప్రమాదం ఉందని విజయశాంతి అన్నారు. కేసీఆర్ వాలకాన్ని చూస్తుంటే... పథకాల పేరుతో ఆయన చేస్తున్న ఖర్చులు, వాటి కారణంగా పెరుగుతున్న అప్పులను తీర్చేందుకు... చివరకు మోడీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒప్పందం కుదుర్చుకోవాలేమోనని ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayashanti  congress leader  Debts  Schemes  congress  BJP  Telengana  politics  

Other Articles