నాయకులు ఎంతటి స్థాయిలో వున్నా.. లేక వారికి ఎంతటి ఫాలోయింగ్ వున్నా.. వారు చేసే వ్యాఖ్యలు.. ప్రజామోదంగా వుండాలి. కానీ నేతలు కేవలం అధికారంలో వున్నామని తమ ఇష్టారాజ్యంగా నోరుపారేసుకుని సరికొత్త వివాదాలకు తెరలేపుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన మంత్రి.. అదే రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యుడిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ఓ లోక్‌సభ సభ్యుడిని విశ్వాసం లేని కుక్క, తెగిన చెప్పుతో కొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన.
ఆయన మరెవరో కాదు ఏకంగా తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలజీ. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగోర్ మీద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నంగునూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారాన్ని మొదలెట్టిన మంత్రి ఈ తరహా దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ‘నంగునూరు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢిల్లీలో కూర్చుని ఖరారు చేస్తున్నట్టుంది. మాణిక్యం ఠాగూర్ అనే ఓ పనికిమాలిన వ్యక్తి ఇప్పుడు ఎంపీ కూడా. ఈ సారి ఓట్లు అడగడానికి వస్తే తెగిన చెప్పులతో కొట్టండి.’ అని వ్యాఖ్యానించారు.
మంత్రి రాజేంద్ర బాలాజీ అంతటితో ఆగలేదు. తన నోటికి మరింత పదును పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంతవరకు నియోజకవర్గానికి కూడా రాలేదని కాంగ్రెస్ ఎంపీకి విశ్వాసం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ను ‘విశ్వాసం లేని కుక్క’గా అభివర్ణించారు. ‘ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాలేదు. గెలిచిన తర్వాత కనీసం కృతజ్ఞత చెప్పడానికి కూడా రాలేదు. విశ్వాసం లేని కుక్క. ఢిల్లీలో కూర్చుంది. ఆయన కుటుంబం కూడా ఢిల్లీలోనే ఉంటుంది.’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన ప్రసంగం పట్ల కార్యకర్తల్లో వచ్చిన జోష్.. వారి పడి పడి నవ్వడాన్ని చూసిన మంత్రి మరింత రెచ్చిపోయారు. ఈసారి ఆ ఎంపీని పందితో పోల్చారు. ‘మాణిక్యం కేవలం ఢిల్లీలో కూర్చుని పత్రికా ప్రకటనలు రిలీజ్ చేస్తుంటాడు. ఆ పంది ఇక్కడకు వస్తే కాల్చేయండి అంటూ తన పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. సాధారణంగా పందులను చంపడానికి రబ్బర్ బుల్లెట్స్ వాడతాం. ఈ పందిని చంపడానికి మీరు కూడా మీరు వాటినే వాడండి.’ అని సూచించారు.
అయితే ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు వచ్చి ఇలా తమను నవ్వులతో ముంచెత్తుతారని, ఆ తరువాత కనిపించరని.. స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. తమిళనాడులోని నంగునూరు, విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను ఖరారు చేసింది. విక్రవాండి నుంచి ముత్తమిళ సెల్వన్, నంగునూరు నుంచి రెడ్డియార్ పట్టి వి నారాయణన్ బరిలో దిగుతున్నారు. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more