విద్యార్థులకు విద్యాబుద్దలతో పాటు క్రమశిక్షణను నేర్పించే పాఠశాలలను అప్రతిష్టపాలు చేసి.. వాటి ఫేస్ బుక్ అకౌంట్లలో అసభ్య, అశ్లీల చిత్రాలు పోస్టు చేసి మారు పేరుతో యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతున్న యువతికి సైబరాబాద్ పోలీసులు అరదండాలు వేశారు. ఈజీ మనీ వేటలో.. ఓవర్ నైట్ లో కుబేరులు కావాలని కలలు కంటూ ఎలాంటి శ్రమలేకుండా వచ్చే రూపాయి ఎన్ని పాట్లు పెడుతుందో తెలియక నేహా ఫాతిమా (21) అనే యువతి కటకటాలు లెక్కపెడుతోంది.
తాను ఓ యువతినేనన్న విషయాన్న మార్చిపోయి.. పాఠశాల విద్యార్థినీ విద్యార్థులను, ఉపాధ్యాయుల ఫోటోలను అశ్లీలంగా మార్పింగ్ చేసి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేసిన ఈ మాయలాడి ఏకంగా బికాం కంపూటర్ల్స్ కూడా చేసింది. కానీ ఒళ్లంచి పని చేయలేక సులభంగా డబ్బు సంపాదించే పనిలో భాగంగా సైడ్ ట్రాక్ పట్టి.. సోలోగానే ఏదో చేయాలని.. ఏదో చేసి.. చిక్కింది. చిన్నదైనా.. పెద్దదైనా తప్పే.. అందుకు శిక్ష అనుభవించాల్సిందేన్న విషయం ఇప్పటికైనా బోధపడుతుందేమో మరి.
పోలీసుల కథనం ప్రకారం.. పాతబస్తీ సంతోష్ నగర్‌కు చెందిన ఫాతిమా బీకాం కంప్యూటర్స్ పూర్తిచేసి ఖాళీగా ఉంటోంది. ఈజీ మనీ వేటలో భాగంగా ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ పేరుతో ఫేస్ బుక్ ఖాతా తెరిచింది. వివిధ పాఠశాలల ఫేస్ బుక్ ఖాతాల్లోని పలు పాఠశాలల ఫొటోలు, వీడియోలను డౌన్ లోడ్ చేసుకుంది. రెండు వారాల క్రితం రెండు ప్రైవేటు పాఠశాలల ఫేస్ బుక్ ఖాతా నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి తిరిగి వారి ఖాతాల్లో అప్ లోడ్ చేసింది.
మొత్తం 225 పాఠశాలల ఫేస్ బుక్ ఖాతాల్లో ఇలా మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను అప్లోడ్ చేసింది. ఇటీవల ఓ పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి తనను తాను ఐటీ నిపుణురాలిగా పరిచయం చేసుకుంది. తన పేరు సైరా జోసెఫ్ అనీ, వారి ఫేస్బుక్ ఖాతాలో అప్లోడ్ అయిన అశ్లీల చిత్రాలను తొలగించాలంటే వేల రూపాయలు ఖర్చవుతుందని చెప్పింది. ఇవ్వకుంటే మరిన్ని పోస్టులు వస్తాయని బెదిరించింది. దీంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో ఫాతిమాను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నట్టు అడిషనల్ డీసీపీ రఘువీర్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more