Woman gangraped by four in Farm house హైదరాబాద్ లో దారుణం: భర్తను బంధించి భార్యపైన గ్యాంగ్ రేప్..

Hyderabad horror woman gangraped by four in farm house

woman gang raped by 4, Gang rape in Telangana, woman gangraped in Farm house, woman gangraped in front of her husband, Gang rape in Rangareddy, Gang rape news, Gang rape in Pahadishareef, gangrape in maheshwaram, hyderabad gangrape, maheshwaram rape victim, Telangana gangrape, Crime

In a gruesome act, a woman was allegedly gangraped by four in farm house in Pahadishareef limits of maheshwaram mandal which falls in the out skirts of Telangana capital Hyderabad, The accused are the farm house owners alleges victims husband.

హైదరాబాద్ లో దారుణం: భర్తను బంధించి భార్యపైన గ్యాంగ్ రేప్..

Posted: 09/27/2019 11:11 AM IST
Hyderabad horror woman gangraped by four in farm house

హైదరాబాద్ నగరంలో ధారుణం జరిగింది. తమ వద్ద పనిచేసే మహిళనే యజమాని చెరిచిన ఘటన చోటుచేసుకుంది. పనివాళ్లతో పోట్లాడి అమె భర్తను బంధించి అతడి కళ్లెదుటే.. భార్యపై ఫామ్ హౌజ్ యజమానితో పాటు మరో ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇద్దరు భూ యజమానులతో పాటు మరో ఇద్దరు వారి స్నేహితులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి, నాగర్‌కర్నూలు జిల్లా ఎనిమిల్లతండాకు చెందిన చందు భార్యాపిల్లలతో కలిసి మహేశ్వరం మండలంలోని హర్షగూడలో నివసిస్తున్నాడు. స్థానికంగా ఓ ఫాంహౌస్‌లో పనికి చేరాడు. అయితే ఈ నెల 18న ఏదో విషయమై ఫామ్ హౌజ్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు చందును దూషించారు. అలా తిడతారేంటంటూ యజమానులకు చందుకూ మధ్య మాట పెరిగింది.

ఇది క్రమంగా ఇరువురి మధ్య గొడవకు దారితీసింది. మాటామాటా పెరిగిన నేపథ్యంలో చందూపై యజమానులు తిరగబడ్డారు. ఈ లోగా తమ స్నేహితులకు ఫోన్ చేసిన రంగారెడ్డి.. తమ ఫామ్ హౌజ్ లోనే పనిచేస్తున్న చందు భార్యను ఓ గదిలోకి తీసుకెళ్లి బంధించిన యజమానులు.. ఆ తరువాత అతడ్ని కూడా బంధించారు. ఆ తరువాత చందు భార్యను మరో గదిలోకి తీసుకెళ్లి అమెపై ఫాంహౌజ్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డిలు అత్యాచారం చేశారు. వీరితోపాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.

అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్లగా మధ్యలోనే అడ్డుకున్న నిందితుల బంధువులు వారిని బుజ్జగించి స్వస్థలమైన నాగర్‌కర్నూలు జిల్లాకు పంపించివేశారు. అయితే, గ్రామస్థుల సహకారంతో గురువారం తిరిగి నగరానికి చేరుకున్న చందు దంపతులు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  gangrape  victim  sexual assault  crime against woman  Pahadishareef. Maheshwaram  Hyderabad  crime  

Other Articles