chinese mayor held with 13.5 tons gold and $37 billion అవినీతి అనకొండా అంటే ఇతనే..

13 5 tons of gold and 37billion cash found during police raid on mayor in china

chinese mayor, Chinese officials, Zhang Qi, former mayor, Community Party, National Supervisory Commission. 13.5 tonns of gold, billion dollors

Police have found mountain of 13.5 tons gold and haul of $37 billion in cash in a raid on the home of an allegedly corrupt ex-mayor in China. Chinese officials came across the incredible mounds of gold bullion while searching his house in Haikou City.

అవినీతి అనకొండ: 13.5 టన్నుల బంగారం.. 37 బిలియన్ డాలర్లు నగదు

Posted: 10/04/2019 12:35 PM IST
13 5 tons of gold and 37billion cash found during police raid on mayor in china

ఓ అధికారి అవినీతి బాగోతం తెలిసి ప్రపంచ దేశాలే నోరువెళ్లబెట్టాయి. ఈ మాజీ మేయర్ నివాసంలో బయటపడిన సంపద ఏకంగా తెలుగు రాష్ట్రాల బడ్జెట్ తో సరిసమానంగా వుంది. అంటే ఎంత మేర అవినీతి కట్టలు బయటపడ్డాయని అంటారా.? అవినీతి అనకొండ ఇంట్లో రూ.4500 కోట్లకు పైగా విలువ చేసే 13,500 కిలోల బంగారం దొరకడం సంచలనమైంది. అంతే కాదు.. రూ.2.64 లక్షల వేల కోట్ల విలువైన కరెన్సీ గుట్టలు కూడా బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.


అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై అక్కడ మంత్రులని కూడా ఉపేక్షించకుండా ఏకంగా మరణదండణ శిక్షలను విధిస్తారు. అంతటి కఠిన శిక్షలను వేసే దేశంలో.. చట్టాలను తూచా తప్పకుండా అమలుపర్చే కమ్యూనిస్టు రాజ్యంలో.. ఒక కమ్యూనిస్టు మేయర్ గా బాధ్యతలు నిర్వహించిన ఈ అవినీతి అనకొండ అవినీతి భాగోతం.. ఆయన నివాసంలో లభ్యమైన సంపద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైనాన్‌ ప్రావిన్సు రాజధాని హైకౌలో మేయర్‌ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు జాంగ్‌ క్వి అనే వ్యక్తి.. అవినీతి ఆరోపణలు రావడంతో అతడి నివాసంలో సోదాలు నిర్వహించారు అధికారులు.. దీంతో ఆయన ఇంట్లో దొరికిన బంగారం, కరెన్సీ చూసి నోరువెల్లబెట్టారు... పెద్ద పెద్ద ర్యాకుల్లో ప్లాస్టిక్‌ సంచుల్లో మూటలు కట్టిన వేలాది బంగారు కడ్డీలు, బంగారు ఇటుకలు.. ఇలా దొరికిన సంపదను లెక్కించడమే వారికి కష్టంగా మారింది.

చివరకు దొరికిన బంగారం 13,500 కిలోలుగా తేల్చారు. 58 ఏళ్ల జాంగ్‌ క్వి... ఈ బంగారం, కరెన్సీ కట్టలను లంచాల ద్వారానే సంపాదించాడని తేల్చారు. అంతటితో ఆగకుండా విలాసవంతమైన విల్లాలను కూడా లంచంగా పుచ్చుకున్నాడట... ఇక ఆసక్తికరమైన విషయం ఏటంటే.. ఆయన అవినీతి సొమ్మంతా వెలికితీస్తే.. చైనాలోని అధికారులు షాక్ కు గురయ్యారు.  జాన్‌క్వీ ఈ బంగారాన్ని, డబ్బును కేవలం లంచాల ద్వారానే సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.

ఇవే కాకుండా పలు విలాసవంతమైన విల్లాలను కూడా లంచంగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరగడం చైనాలోనే ప్రపథమం. ఇక ఈ మేయర్ అక్రమంగా దాచిని మెత్తం చైనాలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం, అలీబాబా వెబ్‌సైట్‌ అధినేత జాక్‌మా ఆస్తుల కంటే.. జాంగ్‌ క్వి సంపదే ఎక్కువ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎవరైనా కష్టపడో, వ్యాపారం చేసే.. పైకి ఎదుగుతారు.. మనోడు మాత్రం.. వీటికి భిన్నంగా సులువైన మార్గాన్ని ఎంచుకుని.. ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.. ఎంతైనా పాపం పండక పోతుందా..? అదే ఇక్కడ జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles