తమ న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని తెలంగాణలొ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరవ రోజుకు చేరుకుంది. ఓ వైపు ప్రభుత్వం ప్రస్తుతం అర్టీసీ సమ్మెలో పాల్గన్న కార్మికులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఇటు అర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు అందిన తరువాత తాము న్యాయపోరాటం చేయడానికైనా సిద్దమని కార్మిక సంఘాల నేతలు ఇప్పటికే తేల్చిచెబుతున్నారు.
ఇదే సమయంలో ఇటు రాష్ట్రంలోని విపక్షాలను కూడా కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్దం అవుతున్నాయి. సమ్మెకు మద్దతుగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలూ, ప్రజా సంఘాలూ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. సమ్మె ఉద్ధృతం చేసే క్రమంలో కార్యాచరణ రూపొందిస్తున్నారు. సమ్మెకు మద్దతుగా తెలంగాణ బంద్ నిర్వహించేందుకు అఖిలపక్ష నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
దీనిపై హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. దీనిపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతున్నది. ప్రభుత్వం బెదిరించినా.. తలొగ్గేది లేదని ఆర్టీసీకి కార్మికులు స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని కార్మికులు చెప్తున్నారు. దసరా ముందు నుంచి సమ్మె చేస్తుండటంతో.. ఇబ్బందులు పడుతూనే సొంత ఊర్లకు వెళ్లారు ప్రజలు. కాగా, ఇప్పుడు తిరిగి వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ బస్సులు ఎక్కితే చార్జీలు మోతమోగుతున్నాయి. రైల్వేలు కిటకిటలాడుతున్నాయి. ఏం చేయాలో ఇలా తిరిగి రావాలో తెలియక పాపం ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు వసూలు చెయ్యొద్దని చెప్తున్నా.. యథేచ్ఛగా డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ యాజమాన్యాలు.
సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో దసరా సెలవులను పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోవడం, వివిధ పట్టణాలతో పాటు హైదరాబాద్ లో స్కూల్ బస్సులను లోకల్ సర్వీసులుగా తిప్పుతూ ఉండటంతో కనీసం రెండు రోజుల పాటు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై నేడు ఉత్తర్వులు వెలువడనున్నాయని ఓ అధికారి వెల్లడించారు. సమ్మె పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపించక పోవడం, కొత్త ఉద్యోగులను నియమించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తొంది. దీంతో ఈ నెల 15 వరకూ సెలవులను పొడిగించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more