Post-monsoon rains in Andhra, Telangana తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Post monsoon rains hit telugu states imd says more showers in store

Arabian sea, Hikaa cyclone, Telangana, Telangana weather, Telangana rains, Rains in Andhra Pradesh, upper air cyclonic circulation, moderate rainfall in Telangana, Krishna, Godavari, Karnataka, Maharashtra, Uttar pradesh, Madya Pradesh, depression, Rains in Telangana, Rain Forecast

Heavy to moderate rains lashed some parts of Telangana on Thursday, affecting road connectivity in villages and damaging standing crops.. IMD predicts heavy to very heavy rainfall very likely in Andhra Pradesh and Telangana.

ఏపీ, తెలంగాణలకు మరో రెండు రోజులు వర్షాలు..

Posted: 10/11/2019 10:11 AM IST
Post monsoon rains hit telugu states imd says more showers in store

తెలుగు రాష్ట్రాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజుల పాటు కోనసాగనున్నాయి. నైరుతి రుతు పవనాలు రాక అలస్యం కావడంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురుస్తాయా లేదా.? అన్న ప్రశ్నలను పటాపంచలు చేస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్ష పాతానికి అధికంగానే నమోదు చేసుకున్న నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివెళ్లాయి. అయినా వర్షాలు మాత్రం ఇంకా తెలుగు రాష్ట్రాలను వీడటం లేదు.

ఇప్పటికే నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వెళ్లాయని ఓ వైపు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నా.. రాష్టాలను మాత్రం వరుణుడు వదిలి వెళ్లడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండురోజులపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వానలు కురిశాయి.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఖమ్మం జిల్లా ఏన్కూరులో 9.3, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.5, వెంకటాపురం మండలం అలుబాక 7.3, మహబూబ్‌నగర్‌లోని హన్వాడలో 7, జగిత్యాల జిల్లా ఇనుగుర్తిలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అటు ఆంద్రప్రదేశ్ లోనూ భారి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని,  కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. వీటి ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు భారీగా వీస్తాయని తెలిపింది.

అలాగే,  కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.  రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, నిన్న కూడా కోస్తాలో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arabian sea  Telangana  moderate rainfall  Hikaa cyclone  Andhra pradesh  Rain Forecast  

Other Articles