TSRTC strike continues in Telangana Movement sytle తెలంగాణ ఉద్యమ పంథాలోనే ఆర్టీసీ సమ్మె..

Tsrtc workers continue their indefinite strike in telangana movement sytle

TSRTC Workers Telangana movement, TSRTC dhoom dhaam, TSRTC vanta varpu, TSRTC bike rally, TSRTC manava haram, TSRTC employees rally, TSRTC public meetings, TSRTC movement in telanagana movement style, Ashwathama Reddy, TSRTC, TSRTC Workers, TSRTC Workers Strong Warning, Telangana Bandh, ts government

After Telangana government ruled out a merger of RTC with TSRTC, JAC workers continued their indefinite strike and revealed the similar style of Telangana movement in achiving their demands.

తెలంగాణ ఉద్యమ పంథాలోనే ఆర్టీసీ సమ్మె.. కార్యచరణ ప్రకటించిన జేఏసీ

Posted: 10/12/2019 04:41 PM IST
Tsrtc workers continue their indefinite strike in telangana movement sytle

ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ సమ్మె కోనసాగుతుందని అర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక మరోమారు తేల్చిచెప్పింది. ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీలో టీఎస్ ఆర్టీసీని విలీనం చేయడం కుదరదని తేల్చిచెప్పిన నేపథ్యంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక తమ నిరసన కార్యక్రమాల కార్యచరణను ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం కోసం అరేళ్ల క్రితం ఎలాంటి ఉద్యమం సాగిందో అదే పంథాలో ఇప్పుడు తమ ఉద్యమం కోనసాగుతుందని జేఏసి స్పష్టం చేసింది.

ధూం ధాం, వంటావార్పు, రాస్తారోకోలు, ర్యాలీలు, బంద్‌లు, బహిరంగ సభలతో తెలంగాణ రాష్ట్రం మరోసారి మార్మోగనుంది. వారం రోజులుగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఇవాళ విపక్ష పార్టీలతో మరోసారి భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నాయకులు అనంతరం సమ్మె షెడ్యూల్ ప్రకటించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన అఖిల పక్ష భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.

తమ ఆందోళనలో భాగంగా రేపు (ఆదివారం) నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. 13న వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, మానవహారం, 16న ర్యాలీలు, 17న ధూం ధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. 19న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. 19న బంద్‌కు పిలుపు ఇవ్వనున్నట్లు ఇంతకుముందే తెలిపారు. అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రకటించారు.

దసరా సెలవులు మరో వారం పొడగింపు:

ధూం ధాం, మానవహారం, సకల జనుల సమ్మె, ర్యాలీలు, రాస్తారోకోలు తదితర కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఊపు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్రంలో మళ్లీ ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తుకు రానున్నాయి. కాగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమైన ప్రభుత్వం.. తాజాగా విద్యా సంస్థలకు దసరా సెలవులను ఈ నెల 19 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీల బస్సులను ప్రయాణికుల తరలింపునకు వినియోగిస్తున్న క్రమంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలోని విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రభుత్వం మరో వారంపాటు పొడిగించింది. దీంతో అక్టోబరు 12 వరకు ఉన్న సెలవులు అక్టోబరు 19 వరకు కొనసాగనున్నాయి. అక్టోబరు 20న ఆదివారం కావడంతో.. 21న విద్యాసంస్థలు తిరిగి తెరచుకోనున్నాయి. రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అక్టోబరు 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles