ఢిల్లీలో చైన్ స్నాచింగ్ ఘటనలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. బైక్ లపై వస్తున్న ముసుగు దొంగలు మహిళలు, యువతులను లక్ష్యంగా చేసుకొని చేతివాటం చూపుతున్నారు. చోరీలకు పాల్పడి క్షణాల్లో మాయమవుతున్నారు. తాజాగా ప్రధాని మోదీ సోదరుడి కుమార్తె దోపిడీ దొంగల బారిన పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డులో బైక్‌పై వచ్చిన ఓ స్నాచింగ్ ముఠా ఆమె చేతిలోని బ్యాగ్‌ను లాక్కెళ్లిపోయారు. అందులో విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలు ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
సివిల్ లైన్ ఏరియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ దేశ ప్రధాని సోదరుడి కుమార్తెనే స్నాచర్ల బారిన పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ సోదరుడి కుమార్తె అయిన దమయంతి మోదీ ఇటీవలే అమృత్సర్ నుంచి ఢిల్లీ వచ్చారు. స్థానిక సివిల్ లైన్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్ భవన్లో ఓ గది బుక్ చేసుకొని బస చేస్తున్నారు. ఆమె అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం ఆమె విమానాశ్రయానికి వెళ్లడానికి గది నుంచి బయటకు వచ్చారు.
తాను బస చేస్తున్న అపార్టుమెంట్ గేట్ ముందుకు రాగానే.. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు క్షణాల్లో తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్, వ్యాలెట్‌ను లాక్కొని పారిపోయారని దమయంతి తెలిపారు. దుండగులు ముసుగు వేసుకొని ఉన్నారని చెప్పారు. హ్యాండ్ బ్యాగులో రూ.56,000 నగదు, రెండు సెల్ ఫోన్లు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని దమయంతి మోదీ వెల్లడించారు. ఇవాళ సాయంత్రం తాను విమానం ఎక్కాల్సి ఉందని.. కానీ, ముఖ్యమైన పత్రాలన్నీ ఆ బ్యాగ్‌లోను ఉండిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దమయంతి మోదీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాని మోదీ సోదరి కుమార్తె కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ జరుపుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఈ చోరీ జరగడం గమనార్హం. కాగా ఢిల్లీ శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇది నిదర్శనమని.. స్వయంగా ప్రదాని సోదరి కూతురికే ఇలాంటి ఘటన ఎదురుకావడంపై విపక్షాలు కేంద్రప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more