శాతాబ్దాల క్రితం నాటి అయోధ్య రామజన్మభూమికి సంబంధించి దశాబ్దాలుగా సాగుతున్న వివాదాస్పద కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పడిన ఐదుగురు సభ్యులు గల ధర్మసానం నలభై రోజులుగా చేపట్టిన రోజువారి వాదనలు ఇవాళ్టితో ముగిసాయి. దీంతో న్యాయస్థానం బెంచీ తీర్పును రిజర్వు చేసింది. నిర్ణత సమయం కంటే ముందుగానే ఈ కేసులో వాదనలు ముగించిన న్యాయస్థానం.. ఇప్పటికీ ఏమైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది.
చివరి రోజు విచారణ సందర్భంగా వాడీవేడిగా వాదనలు ముగిశాయి. ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు విషయమై హైడ్రామా చోటు చేసుకుంది. విచారణ సందర్భంగా ముస్లిం సంస్థల తరఫు లాయర్ రాజీవ్ ధావన్ అయోధ్య రామజన్మ స్థానం అంటూ తన వాదనకు మద్దతుగా హిందూ మహాసభ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో చూపిన ఓ పుస్తకాన్ని చించేశారు. దీనిపై కోర్టులో పెద్ద రచ్చ జరిగింది. అయితే రాజీవ్ ధవన్ తన చర్యను సమర్థించుకున్నారు. సీజేఐ చెప్పడంతోనే తాను చింపివేసినట్లు ఆయన తెలిపారు. సీజేఐ కూడా దీనిని అంగీకరించారు.
అయితే శాంతి భద్రతల దృష్యా అయోధ్య నగరంలో ఇప్పటికే 144 సెక్షన్ ను విధించారు. అయోధ్యపై సుప్రీం తీర్పుతో పాటు బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం ఉన్న సందర్భంగా మరో రెండు నెలల పాటు అయోధ్యలో 144 సెక్షన్ నిషేధ ఉత్తర్వులు విధిస్తున్నట్లు అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా తెలిపారు. అయోధ్యలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. అయోధ్యలో తీర్పు అనంతరం బాణసంచా కాల్చకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీపావళి పండగ సందర్భంగా కూడా బాణసంచాను విక్రయించకుండా చర్యలు తీసుకున్నారు.
అయోధ్య వివాదం పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీవివాదానికి స్నేహపూర్వక పరిష్కారం కనుగొనడంలో విఫలమైన అనంతరం భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనుండగా, అప్పటిలోగా ఈ మైలురాయి కేసులో ధర్మాసనం తన తీర్పును ఇస్తుందని అందరూ భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more