కంచె చేను మేసిన చందంగా ప్రజలకు రక్షణ కల్పిస్తామని ప్రతీణబూనిన ఓ పోలీసు అధికారి.. తానే చట్టవిరుద్ద చర్యలకు పాల్పడి అడ్డంగా బుక్కయ్యాడు. అధికారం అందలం ఎక్కించినా బుద్ధి పాతాళంలో ఉందని నిరూపించాడు. సబ్ ఇన్ స్పెక్టర్ హోదాలో తాను చేయకూడని పనలు చేసి తప్పించుకోజూశాడు. అయితే సారీతో మ్యాటర్ ముగుస్తుందని బావించి అది కూడా చెప్పాసినా.. అతని ఉగ్యోదానికే ఎసరు తెచ్చింది సారీ చెప్పిన వీడియో. వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు.
అయితే అతడి ఏ ఒక్క మహిళకో కాకుండా అనేక మంది మహిళలకు ఇదే తరహాలో వీడియోలను పంపించాడు. వారి ఫోన్ నెంబర్లు ఇతనికెలా చేరాయనేగా మీ డౌట్. ట్రాఫిక్ ఎస్ఐగా విధి నిర్వహణలో భాగంగా లభించిన మహిళ ఫోన్ నంబర్లకు అశ్లీల వీడియోలు పోస్టుచేస్తూ అతి తెలివిగా వ్యవహరించాడు. అయితే ఎస్ఐ అయితే మాత్రం ఇలా వీడియోలు పంపడానికి ఎం అధికారం వుందని ఓ మహిళా బాధితురాలు అతడ్ని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తద్వారా అతడి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది.
వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం వేలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో రాజామాణిక్యం సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వేలూరు, కాట్పాడి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుంటారు. ద్విచక్ర వాహన చోదకుల తనిఖీల సందర్భంగా నిబంధనలు పాటించని వారికి ఫైన్ విధించి రశీదుపై వారి ఫోన్ నంబర్లు రాస్తుంటారు. ఈ విధంగా ఫైన్ విధించిన మహిళ ఫోన్ నంబర్లను ప్రత్యేకంగా మరో కాయితంపై కూడా రాసుకున్న ఎస్ఐ.. తన విధులు పూర్తైన తరువాత వారికి రహస్యంగా అశ్లీల వీడియోలు పోస్టు చేశాడు.
ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చే సందేశాల్లో అశ్లీల వీడియోలు, ఫోటోలు కనిపించడంతో.. మండిపడ్డ మహిళలు ట్రాఫిక్ పోలీసులను తిట్టిపోశారు. అయితే ఓ బాధితురాలు మాత్రం అలా తిట్టడంతో సరిపెట్టుకోక.. ఏకంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తనకు వచ్చిన సందేశాలపై అరా తీసింది. ఫైన్ కట్టిన తర్వాత తమ నంబర్లకు అశ్లీల వీడియోలు రావడానికి కారణం ఎస్ఐ రాజమాణిక్యమేనని తెలుసుకుని నడిరోడ్డుపైనే అతడ్నినిలదీశారు. అయితే ఈ వాగ్వాదాన్ని కొందరు వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన వేలూరు డీఎస్పీ బాలకృష్ణన్ మహిళల ఆరోపణలు నిజమేనని నిర్థారణకు వచ్చారు. దీంతో రాజామాణిక్యంపై సస్పెన్షన్ వేటు వేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more