తెలంగాణ రాష్ట్రంలోని ఏ మద్యం దుకాణంలో మద్యాన్ని కొనుగోలు చేసినా.. మర్చిపోలేని కిక్కు మీ సొంతం. అదెలా సాధ్యం అంటారా.? కొత్త సీసాలో పాత మందు పోసినట్ల.. ప్రతీ రెండేళ్లకు ప్రభుత్వం తమ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురావడం.. ఈ పేరుతో మద్యం దుకాణాల నిర్వహణ, మద్యం అమ్మకాలు చేతులు మారడం కామన్ గా మారింది. ఈ తంతులో భాగంగా మద్యం దుకాణాలను కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాధి మందికి వేల సంఖ్యలోనే దుకాణాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
ధరఖాస్తుకు రెండు లక్షల రూపాయల మేర రుసుమును విధించిన ప్రభుత్వం తమ ఖజానాను నింపుకుని.. 1467 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూర్చుకుంది. ఒక్కో మద్యం దుకాణ నిర్వాహకుడు ఏకంగా యాభై దుకాణాలకు ధరఖాస్తులు తీసుకుని అప్లై చేస్తే ఒక్క దుకాణం మాత్రమే వచ్చింది. అంటే కోటి రూపాయల మేర డబ్బులు పెడితే ఒక్క మద్యం షాపు మాత్రమే లభించింది. ఇది చాలదన్నట్లు స్థానికంగా మద్యం దుకాణాల యజమానులకు అద్దెలు కూడా చెల్లించాలి, అవి కూడా బారెడు వుంటాయి. దీనికి తోడు దుకాణంలో వుండే సిబ్బంది జీతబెత్యాలు, ఇలా అన్నీ వెరసి మద్యం దుకాణంలోని అమ్మాకాలతోనే మొత్తం తన డబ్బును రాబట్టుకోవాల్సి వుంటుంది.
అయితే లక్ష నుంచి రెండు లక్షలకు మద్యం దుకాణాల అప్లికేషన్లు పెంచడం వెనుక మద్యం రిటైల్ అమ్మకం దారులకు లబ్ది చేకూర్చే ప్రయత్నం కూడా వుందని స్పష్టమవుతోంది. దీంతో ఈ ఏడాది డిసెంబర్ నాటికి సందట్లో సడే మియా అన్న చందంగా మద్యం ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితికిగాను (2019-21) ఎక్సైజ్ శాఖ ఈ పాలసీని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,216 దుకాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 19 డిపోల ద్వారా వీటికి మద్యం సరఫరాకు ఏర్పాట్లు చేసింది.
2021 అక్టోబరు 31 వరకు అమల్లో ఉన్న కొత్తపాలసీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1467 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. దీనికి అదనంగా మద్యం ధరలను కూడా పెంచి మరికొంత ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకుగాను ఇటీవల ఏపీ ప్రభుత్వం తన కొత్త మద్యం విధానంలో 15 నుంచి 20 శాతం ధరలు పెంచడంతో, అదే విధానాన్ని తాము కూడా ఆచరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, దుకాణాల నిర్వహణకు ఎవరూరాని చోట్ల ప్రభుత్వమే దుకాణాలు నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more