BJP Will Have to Bend, Says Sharad Pawar అధికారం కావాలంటే బీజేపి తలొగ్గాల్సిందే: శరద్ పవార్

Share cm post if bjp wants to form maharashtra govt says sharad pawar

BJP, Shiv Sena, NCP, Congress, Maharashtra government formation, Devendra Fadnavis, Uddhav Thackeray, power sharing formula, CM, Dy, CM, Minister portfolios, Sharad Pawar, Maharashtra Assembly Polls 2019, Current Affairs, India, Maharashtra, Politics

Nationalist Congress Party (NCP) President Sharad Pawar made it clear that he had no proposal from the Sena and had not spoken with its chief Uddhav Thackeray over the power dynamics in the state.

అధికారం కావాలంటే బీజేపి తలొగ్గాల్సిందే: శరద్ పవార్

Posted: 11/02/2019 11:57 AM IST
Share cm post if bjp wants to form maharashtra govt says sharad pawar

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు అంశంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 50-50 ఫార్ములాకు కట్టుబడి తమకు కూడా రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని శివసేన పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఈ క్రమంలో 54 సీట్లను గెలుచుకున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో శివసేన నేతలు భేటీ కావడం ఉత్కంఠను మరింత పెంచింది. అసలు ఏం జరగబోతోందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి నెలకొంది.

కాగా, ఈ విషయమై స్పందించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్.. బీజేపి తన మొండి వైఖరిని వీడి శివసేనతో చేయి కలపాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అధికారం కావాలంటే బీజేపి శివసేన ఎదుట తలొగ్గాల్సిందేనని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ-శివసేనలకు ప్రజలు మెజార్టీ స్థానాలను కట్టబెట్టారని... కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? వారిద్దరూ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో ప్రజలు ఏం కోరుకున్నారో... దానికే తాము కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. ఎన్సీపీ ప్రతిపక్షంలో ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని... వారి అభీష్టం మేరకు తాము ప్రతిపక్ష స్థానంలోనే కూర్చుంటామని చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా... ఈ దిశగా తమ పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని అన్నారు. దీంతో మహరాష్ట్రాలో కొత్త రాజకీయ ఈక్వేషన్ల ఉత్భవిస్తున్నాయని మీడియా రాసిన కథనాలకు ఆయన చెక్ పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Shiv Sena  NCP  Congress  Sharad Pawar  uddhav thackeray  Devendra Fadnavis  Sanjay Raut  Maharashtra  Politics  

Other Articles