తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 32వ రోజుకు చేరింది. ఈ క్రమంలో అనేక మంది కార్మికులు తమ కుటుంబాల పోషణ, భవిష్యత్తుపై మానసిక అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అటు తెలంగాణ ప్రభుత్వం కానీ, ఇటు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్యవేదిక కానీ మెట్టు దిగకపోవడంతో.. తీవ్ర మానసిక వేదనకు గురైన పలువురు కార్మికులు గుండెపోటుకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు కార్మికులు గుండెపోటుకు గురై మరణించగా, తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన అర్టీసీ డ్రైవర్ కూడా మరణించాడు.
ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం లోపు విధుల్లో చేరాలని.. ప్రభుత్వం గడువును ఇస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఇచ్చిన అల్టిమేటం కారణంగా ఆర్టీజీ కార్మికుల్లో మానసిక అందోళన ఎక్కువవుతోంది. అప్పటికీ విధుల్లో చేరకపోతే... ఇక వారిని తొలగించినట్లేనని సంకేతాలు ఇచ్చేయడంతో... ఆర్టీసీ కార్మికులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తమ ఉద్యోగాలు పోతాయేమోనని తీవ్ర ఆవేదన, ఆందోళనా చెందుతున్నారు. ఇప్పటికే 18 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు విడిచారు.
ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో ఉద్యోగం వుంటుందా.? లేకపోతే ఎలా అని తీవ్ర అందోళనకు గురైన మరో డ్రైవర్ గుండెపోటుకు గురై మరణించారు. నల్గొండ జిల్లా దేవరకొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌రెడ్డి ఈ తెల్లవారుజామున గుండె పోటుతో ప్రాణాలొదిలాడు. స్వగ్రామం నాంపల్లి మండలంలోని లింగపల్లిలో ఆదివారం అర్ధరాత్రి అతడు గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే జైపాల్‌రెడ్డిని దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.
మరో ఆరు మాసాల్లో రిటైర్మెంట్ కావాల్సిన జైపాల్ రెడ్డి.. పదవీ విరమణ పోందిన తరువాత కూడా ఏం చేయ్యాలనే అంశంపై కూడా ఆయనకు కొన్ని ప్లాన్లు వున్నాయి. అయితే సీఎం కేసీఆర్ ప్రకటనతో తీవ్ర మానసి ఆందోళనకు గురైన ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కార్మికులు అగ్రహావేశాలకు లోనూ దేవరకొండ బస్ డిఫో ఎదుట అందోళనకు దిగారు. ఈ అందోళనలో డ్రైవర్ జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులు కూడా పాల్గోన్నారు. దీంతో మృతదేహంతో దేవరకొండ బస్సు డిపో వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులు ధర్నాకు దిగారు. దీంతో డిపో వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more