అయోధ్యలోని వివాదాస్పద భూమి రామ మందిరానిదేనని దేశసర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా తీర్పు వెలువరించేందుకు ముందు భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1946లో ఫైజాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును దాఖలు చేస్తూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇస్తున్నారు.
ఈ సంద్భంగా తీర్పును వెలువరించిన భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మట్లాడుతూ రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని సూచనలు చేశారు. ప్రాథమిక విలువలు, మతసామరస్యాన్ని ప్రార్థనా మందిరాల చట్టం పరిరక్షిస్తుందని వ్యాఖ్యానించారు. రాముడు అయోధ్యలోనే జన్మించాడన్న హిందువుల విశ్వాసం నిర్వివాదాంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ అన్నారు. ప్రధాన గుమ్మటం కింద గర్భాలయం ఉందని హిందువులు విశ్వసిస్తున్నారని చెప్పారు.
గతంలో ఈ వివాదాస్పద స్థలంలో రెండు మతాలూ ప్రార్థనలు చేసేవని తెలిపారు. ఈ కేసు దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న హిందూ భక్తుల కోసం ఉద్దేశించిందని గొగోయ్ అన్నారు. ఇది వ్యక్తిగత హక్కుల కోసం దాఖలు చేసిన వ్యాజ్యం కాదని చెప్పారు. మసీదును ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని ఇప్పటికే హైకోర్టు చెప్పిందని తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more