మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో గత పక్షం రోజులుగా ఏర్పడిన ప్రతిష్టంభన కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 9 శనివారంతో గత ప్రభుత్వ పదవీకాలం ముగిన క్రమంలో మహారాష్ట్రంలోని దేవేంద్ర ఫడ్నావిస్ ఆపధర్మ ప్రభుత్వాన్ని మరికొన్ని రోజుల పాటు కొనసాగిస్తారా.? లేక పరిష్కారం దిశగా సాగుతారా.? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా.? అన్న సందేహాలకు చెక్ పెడుతూ గవర్నర్ రాజ్యాంగబద్దంగా నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపిని ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు రావాల్సిందిగా అహ్వానించారు.
అయితే బీజేపి అధిష్టానంతో అప్పటికే సంప్రదింపులు చేసిన రాష్ట్ర నాయకత్వం.. అందుకు విముఖత వ్యక్తం చేసింది. ఈ తరుణంలో రెండో అతిపెద్ద పార్టీ శివసేనను గవర్నర్ ఆహ్వానించడంతో ఎన్సీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ ముందుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. శివసైనికుడే ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. అయితే శివసేన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఉద్దవ్ థాకరే పేరును తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు ఇందుకోసమే అన్నట్లు ఆయనను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దింపింది.
అయితే శివసేనకు మద్దతు ఇవ్వాలంటే తమ షరతులు అంగీకరించాల్సిందేనంటూ ఎన్సీపీ విధించిన షరతులకు శివసేన లోబడింది. వాటిలో ఒకటి తమకు రెండున్నరేళ్ల పాటు అధికారం అందించడం.. కాగా రెండోవది ఎన్డీయే నుంచి బయటకు రావడం. ఈ రెండింటికి శివసేన అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో కేంద్రంలోని తన మంత్రితో రాజీనామాకు సిద్ధమైంది. కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ మంత్రి అరవింద్ సావంత్ సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఎన్సీపీతో అధికార పంపకం చేసుకునే విషయంలో ఢిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని వారికి అందించింది.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి దక్కుతుందనే ఉహాగానాలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ మాట్లాడుతూ.. అసంబద్ధమైన వాతావరణంలో తాను మంత్రిగా కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని బీజేపీ ధీమా వ్యక్తంచేస్తూ వచ్చింది. ఏకైక పెద్ద పార్టీగా అవతరించడంతో అవసరమైతే ఇతరుల మద్దతు కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే అనూహ్యంగా ఆ పార్టీ వెనక్కి తగ్గి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
గవర్నర్ ఆహ్వానం నేపథ్యంలో బీజేపీ కోర్ కమిటీ ఆదివారం రెండుసార్లు భేటీ అయి, ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండాలని తీర్మానించింది. శివసేన మద్దతు ఇవ్వకపోవడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని శివసేన షరతు విధించి ప్రజా తీర్పును కించపరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. అందువల్లే తాము ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకున్నామని పేర్కొన్నారు. ఇదిలావుండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్ థాకరేకు కాంగ్రెస్, ఎన్సీపీలు ఓటు వేయనున్నాయని సమాచారం. దీంతో ఆదిత్య థాకరే బదులుగా ఆయన సీఎం కానున్నారు. ఇక మిత్రపక్షాలైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరో ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వనున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more