Devotees throng Shiva temples కార్తీక ఫౌర్ణమి పర్వదినాన కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

Devotees throng shiva temples on the eve of karthika pournami

Lord Shiva, karthika jyothi, tulasi puja, Usiri chettu puja, sri maha vishnu, karthika pournami, shivalayas, shiva temples, devotees, special Abhishekam, special pujas, Telangana, andhra pradesh, politics

The Lord Shiva temples in Telugu states witnessed heavy rush of devotees today on the eve of Karthika Pournami. The devotees, performed special pujas and offered prayers. Special Abhishekams were also conducted by the priests.

కార్తీక ఫౌర్ణమి పర్వదినాన కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

Posted: 11/12/2019 11:56 AM IST
Devotees throng shiva temples on the eve of karthika pournami

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస శోభ సంతరించుకుంది. వేకువజామునే తులసి, ఉసిరి చెట్ల వద్ద పూజలు నిర్వహించిన భక్తులు..  తెల్లవారు జామునుందే శివాలయ దర్శనాలకు బారులు తీరారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. హర హర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు గంగాధరుడైన అర్థనారీశ్వరుడికి నామస్మరణలో తరించిపోయారు. భక్తులు పెద్ద సంఖ్యలో శైవక్షేత్రాలతో పాటు వైష్ణవ క్షేత్రాలకు కూడా తరలివెళ్లడంతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి.

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుణ్యక్షేతాలు, ఆలయాల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక, అయోధ్యలో కోలాటాలతో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభమ్యాయి. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. భారీగా తరలి వస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి తీరంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గాలక్ష్మణేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

పంచారామక్షేత్రాలైన భీమేశ్వరం, సోమేశ్వరం, అమరేశ్వర, సహా అన్ని శైవక్షేత్రాల్లో భక్తులు శివయ్యను దర్శించికుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటు కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల తిరుపతి ఫుణ్యధామంలోని శ్రీవారి ఆలయ అధికారులు.. కార్తీక పౌర్ణమి శోభను పురస్కరించుకుని కపిల మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల ప్రత్యేక ఏర్పాటు్లు చేశారు. కపిలతీర్థం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక, భద్రాచలంలోని గోదావరి తీరం ఈ తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నది వద్దకు చేరుకున్న భక్తులు స్నానమాచరించి కార్తీక దీపాలు వదులుతున్నారు.

ఇక, తెలంగాణలో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలైన రామప్ప, హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం, సిద్దేశ్వర ఆలయం, వరంగల్ లోని కాశీవిశ్వేశ్వర రంగనాథ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. వేయిస్తంభాల ఆలయంలో కొలువైన రుద్రేశ్వరస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కరీంనగర్ శ్రీరాజరాజేశ్వరీ దేవీ ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. అటు త్రివేణి సంగమంగా ప్రసిద్దికెక్కిన కాళేశ్వర ఫుణ్యక్షేత్రంలో కాళేశ్వర, ముక్తేశ్వర స్వామివారికి కూడా ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక గోచారఫల దోషాలున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles