తెలుగు రాష్ట్రాల్లో పోస్టల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తు గడువు నవంబరు 14తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. నవంబరు 21 వరకు ఆన్ లైన్ దరఖాస్తుకు అవకాశం ఉంది. అభ్యర్థులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోసుకోవచ్చు. పదో తరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మెరిట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.
ఓసీ/ వెనుకబడిన తరగతులు/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించాల్సినవారు ఆన్లైన్ లేదా సంబంధిత పోస్టాఫీసులో చెల్లించవచ్చు. కాగా ధరఖాస్తు చేసే అభ్యర్థుల వయోపరిమితి: 15.10.2019 నాటికి 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన మొత్తం 3677 పోస్టులలో ఆంధ్రప్రదేశ్ లోని 2707 పోస్టులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 970 పోస్టు లకు సంబంధించి ధరఖాస్తులు కోరుతున్నారు. ఏపీలోని మొత్తం 2707 పోస్టులలో బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిప్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలున్నాయి. ఇక అటు తెలంగాణలోని 970 పోస్టులలో కూడా ఇవే ఖాళీలు వున్నాయి. ఈ ఖాళీల భర్తీకి పోస్టల్ శాఖ నోటిఫికేషన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. అక్టోబరు 14న రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 22న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 3677 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల ఉద్యోగాలకు గాను ఏపీ సర్కిల్లో 2707 పోస్టులు, తెలంగాణ సర్కిల్లో 970 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
ముఖ్యమైన తేదీలు..
* రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు తేదీ ప్రక్రియ ప్రారంభం: 15.10.2019
* రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లించడానికి చివరితేది: 14.11.2019
* ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2019
* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.11.2019.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more