ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ కొనసాగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం.. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్ ఆర్టీసీకి మాత్రమే వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
2015లో మరోసారి ప్రభుత్వం జీవో ఇచ్చిందని న్యాయవాది విద్యాసాగర్ తెలపగా.. పరిశీలించిన న్యాయస్థానం ఆ జీవో ఆరునెలల వరకే వర్తిస్తుందని పేర్కొంది. హైకోర్టు చట్టానికి అతీతం కాదని... చట్టాల పరిధి దాటి వ్యవహరించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని హైకోర్టు తెలిపింది. ఈమేరకు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు బస్సుల్లో అధికఛార్జీలు వసూలు చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపగా.. దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించింది. అధికఛార్జీల వసూలు కారణంగా సమ్మె చట్ట విరుద్ధమంటూ ప్రకటించలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులతో చర్చలు జరపాలని ఏ చట్టంలో ఉందని.. ఈ విషయంలో ఏ ప్రాతిపదికన హైకోర్టు ఆదేశించగలదని ప్రశ్నించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె విషయంలో తాము న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పారు. కోర్టు సూచించిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసి సమస్య పరిష్కారానికి కృషిచేయాలన్నారు. ‘హైకోర్టు ఈరోజు వాదనల తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలని సూచించింది. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి రేపు మధ్యాహ్నంలోగా కమిటీ ఏర్పాటుపై వివరాలను వెల్లడిస్తామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలపడం బాగానే ఉంది’ అని అన్నారు.
తాము కూడా ముఖ్యమంత్రిని అదే కోరుతున్నామన్నారు. కమిటీ వేసి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించాలని కోరారు. భేషజాలకు పోకుండా కమిటీ ఏర్పాటుకు అంగీకరించి చర్చల ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నట్లు చెప్పుకోచ్చారు. కోర్టు ఆదేశాలు, కమిటీ నిర్ణయం తమకు అంగీకారమన్నారు. కమిటీకి కాలపరిమితి ఉంటుందని తాను భావిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం కమిటీ వేస్తే చర్చలకు సిద్ధంగా ఉన్మని స్పష్టం చేశారు. సమ్మె చట్ట విరుద్ధమని చెప్పడానికి వీల్లేదని రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలిపిందని అశ్వత్థామరెడ్డి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more